Breast Cancer: పురుషుల‌కూ ముప్పే.. !

Breast Cancer: రొమ్ము క్యాన్స‌ర్ అనేది కేవ‌లం ఆడ‌వారికి మాత్ర‌మే వ‌స్తుంది అనుకుంటే అపోహే. ఈ మ‌హ‌మ్మారి పురుషుల‌కు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాక‌పోతే చాలా అరుదుగా మ‌గ‌వారిలో ఈ కేసులు చూస్తుంటాం. 2005 నుంచి 2010 మ‌ధ్య‌లో వ‌చ్చిన రొమ్ము క్యాన్స‌ర్ కేసులు 289,673. వాటిలో 2,054 పురుషుల్లోనే క‌నిపించింది. అంత‌ర్జాతీయంగా చూసుకుంటే బ్రెజిల్‌కి చెందిన మ‌గ‌వారిలో ఈ కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి. అతి త‌క్కువ కేసులు జ‌పాన్, సింగ‌పూర్‌లో కనిపిస్తున్నాయి.

ఇక ఏ వ‌య‌సు మ‌గ‌వారిలో ఈ రొమ్ము క్యాన్స‌ర్ క‌నిపిస్తుందంటే.. ఎక్కువ‌గా 60% నుంచి 70% జీవితం మిగిలి ఉన్న‌వారిలో క‌నిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే వ‌య‌సు పై బ‌డుతున్న‌వారికి ఈ ముప్పు ఉంటుంది. ఎక్కువ ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఉన్న మ‌గ‌వారు తప్ప‌కుండా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఒక‌వేళ కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికైనా ఉంటే కూడా రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన వారు రొమ్ము క్యాన్స‌ర్ సంబంధిత ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిద‌ని వైద్యులు సూచిస్తున్నారు.