Spiritual: పిల్లలకు ఈ శ్లోకాలు తప్పకుండా నేర్పించాలి
Spiritual: ఆధ్యాత్మికతను అలవరుచుకోవడంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. హిందువులు అయినంత మాత్రాన అందరూ దేవుడిని నమ్మాలని లేదు. ఎవరి నమ్మకం వారిది. అయితే దైవభక్తి ఉన్నవారు తప్పకుండా మీ పిల్లలకు (ఉంటే) ఈ సంస్కృత శ్లోకాలను నేర్పించండి.
గాయత్రి మంత్రం
శక్తిమంతమైన మంత్రాల్లో గాయత్రి మంత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మటుకు పాఠశాలల్లో ఈ మంత్రాన్ని ఉదయం పూట ప్రార్ధన సమయంలో చెప్పిస్తున్నారు. ఓం అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా మనసు మెదడు ప్రశాంతంగా ఉంటాయి. చదువుకునే పిల్లలకు ఈ రెండూ ప్రశాంతంగా ఉంటేనే దేనిలోనైనా రాణించగలరు.
గురు మంత్రం
గురు మంత్రం నేర్పించడం ద్వారా పెద్దలను గురువులను ఎలా గౌరవించాలి అనే అంశాన్ని పిల్లలు నేర్చుకోగలుగుతారు. వారి జీవితంలో గురువుల ప్రభావం ఎంత కీలకం అనే అంశాన్ని కూడా తెలుసుకోగలుగుతారు.
మహా మృత్యుంజయ మంత్రం
శివ మంత్రం అయిన ఈ శక్తిమంతమైన మహా మృత్యుంజయ మంత్రం రోజూ జపించడం వల్ల ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పిల్లలకు అనారోగ్య సమస్యలు వంటివి ఉన్నా మహా మృత్యుంజయ హోమం కూడా జరిపిస్తుంటారు. పిల్లలు భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యం వస్తుంది.
సర్వ మంగళ మాంగళ్యే
పార్వతికి సంబంధించిన ఈ మంత్రం ఎంతో గొప్పది. ఈ మంత్రం వల్ల ఎలాంటి నెగిటివిటీ ఉన్నా పోతుంది.
సరస్వతి మంత్రం
చదువుల తల్లి సరస్వతి. పిల్లలు చాలా మటుకు పరీక్షలకు వెళ్లే ముందు బాగా రాయాలని సరస్వతి దేవినే మొక్కుతుంటారు. రోజూ సరస్వతి దేవి మంత్రం జపించడం వల్ల తల్లి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.
మహాలక్ష్మి మంత్రం
అష్టైశ్వర్యాలు కలిగేందుకు ఈ మంత్రం జపించడం ఎంతో ముఖ్యం. పిల్లలు చదువుకుని ప్రయోజకులు అయ్యి బాగా కష్టపడి డబ్బు సంపాదించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ మంత్రం పిల్లల్లో ఆర్ధిక అంశాలపై పట్టు సాధించేందుకు తోడ్పడుతుంది.
వక్రతుండ శ్లోక
ఈ వినాయక మంత్రం సర్వ విఘ్నాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ధైర్యంగా అధిగమించేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది.
హరే కృష్ణ మంత్రం
ఆధ్యాత్మికతను పెంపొందించే మంత్రం ఇది. ఈ మంత్రం జపిస్తున్న ప్రతీసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
రుద్ర శ్లోకం
శివుని రుద్ర అవతారానికి చేరువ చేసే మంత్రం ఇది. దుష్ట శక్తుల నుంచి దూరం చేసేందుకు ఈ శ్లోకం ఎంతో ఉపయోగపడుతుంది.