JN.1: ల‌క్ష‌ణాలు క్లియ‌ర్‌గా తెలుస్తాయి.. నిర్ల‌క్ష్యం అస్స‌లు వ‌ద్దు

Covid Variant JN.1: ముగిసింద‌నుకున్న కోవిడ్ మ‌ళ్లీ కొత్త వేరియంట్‌తో బుస‌లు కొడుతోంది. కేర‌ళ‌లో ఇప్ప‌టికే 2000 కేసులు ఉన్నాయి. ప‌ది మంది మ‌ర‌ణించార‌ని కూడా అక్క‌డి వైద్య శాఖ అంటోంది. దాంతో ఇత‌ర రాష్ట్రాలు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. మ‌ళ్లీ మాస్కులు త‌ప్ప‌నిసరిగా ధ‌రించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త వేరియంట్ పేరు JN.1. దీని ల‌క్ష‌ణాలు సాధార‌ణ జలుబు వ‌చ్చిన‌ప్పుడు కనిపించే ల‌క్ష‌ణాల కంటే ఇంకా క్లియ‌ర్‌గా ఉంటాయ‌ని వైద్యులు చెప్తున్నారు. అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటో తెలుసుకుందాం.

ల‌క్ష‌ణాలు ఇలా ఉంటాయి

విప‌రీతమై నీర‌సం

ఒళ్లంతా నొప్పులు

గొంతు నొప్పి

ఈ మూడు ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించండి. కాక‌పోతే ఈ కొత్త వేరియంట్ వ‌ల్ల‌ వ‌య‌సులో ఉన్న‌వారికి పెద్ద‌గా రిస్క్ లేదు. కానీ వ‌య‌సు పై బ‌డిన‌వారికి విపరీతంగా వ్యాపిస్తోంది. వారు వ‌య‌సు రిత్యా త‌ట్టుకోలేక‌పోతున్నారు. కోవిడ్ త‌గ్గిపోయింది అనుకోవ‌డానికి లేద‌ని ప్ర‌తి ఆరు నెల‌లు లేదా సంవ‌త్స‌రానికి కొత్త వేరియంట్ల రూపంలో క‌బ‌ళిస్తూనే ఉంటుంద‌ని వైద్యులు చెప్తున్నారు. ల‌క్కీగా భార‌త్ మొత్తం వ్యాక్సిన్ వేసుకుంది కాబ‌ట్టి ప్ర‌మాదం ఏమీ లేద‌ని పేర్కొన్నారు.