Health: శీతాకాలం.. ఆహారం మార్చాల్సిందే..!

Health:  మ‌న‌కు రుతువులు మారిన‌ట్లే ఆ సీజ‌న్‌కు త‌గ్గ‌ట్టు ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఏ సీజ‌న్‌లో అయినా వ‌చ్చే కాలానుగుణ వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఇప్పుడు చ‌లికాలం మొద‌లైపోయింది. ఉద‌యం పూట విప‌రీతంగా మంచు క‌మ్మేస్తోంది. మ‌రి ఈ శీతాకాలంలో తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుందాం.

బ్రొకోలీ (broccoli)

ఇందులో విట‌మిన్ A, E C పుష్క‌లంగా ఉంటాయి. దీనితో పాటు పీచు ప‌దార్థం కూడా ఎక్కువే. వారంలో ఒక‌సారి బ్రొకోలీని 30 సెకెన్ల పాటు ఉడికించి తింటే ఎంతో మంచిది. దీనిని వేపుకుని, వండుకుని తింటే అందాల్సిన పోష‌కాలు అంద‌వు.

పుట్ట‌గొడుగులు (mushrooms)

షీట‌కే, మైట‌కే అనే రెండు ర‌కాల పుట్ట‌గొడుగుల్లో తెల్ల ర‌క్త క‌ణాల ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి.

వెల్లుల్లి (garlic)

చ‌లికాలంలో వెల్లుల్లి తిన‌డం అల‌వాటు చేసుకోండి. చెడు కొలెస్ట్రాల్‌ని ఇట్టే క‌రిగించేసే శ‌క్తి వెల్లుల్లికి ఉంది. రోగ నిరోధ‌క శక్తి పెంచుతుంది.

నిమ్మ జాతి పండ్లు (citrus fruits)

నిమ్మ జాతి పండ్ల‌లో విట‌మిన్ సి ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. వారంలో నాలుగు రోజులు నిమ్మ జాతి పండ్ల‌ను తిన‌డం అల‌వాటు చేసుకోండి.

పాల‌కూర‌ (spinach)

ఇది సీజ‌న్‌తో సంబంధం లేకుండా వండుకునే ఆకుకూర‌. ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. ర‌క్తహీన‌త లేకుండా చేస్తుంది.

చేప‌లు (fish)

మీకు చేప‌లు తినే అల‌వాటు ఉంటే వారంలో మూడు రోజులు సాల్మ‌న్ చేప‌ల‌ను వండుకుని తినండి. ఇందులో ఉండే ఒమెగా 3 మ‌రే చేప‌ల్లోనూ ఉండ‌దట‌.