ధ‌న‌ త్రయోద‌శి నాడు ఏవి కొనాలి.. ఏవి కొన‌కూడ‌దు?

Dhanatrayodashi: దీపావ‌ళి పండుగ వ‌చ్చేస్తోంది.  మ‌న తెలుగు రాష్ట్రాల్లో ధ‌న త్ర‌యోద‌శి, ధ‌న‌వంత్రి త్ర‌యోద‌శి అని జ‌రుపుకుంటారు. ఉత్త‌ర రాష్ట్ర ప్ర‌జ‌లు ధ‌న్‌తేరాస్‌గా జ‌రుపుకుంటారు. ల‌క్ష్మీదేవి, కుబేరుడిని ధ‌న‌త్ర‌యోద‌శి నాడు పూజిస్తారు. ధ‌న త్రయోద‌శి నాడు ఎలాంటి ప‌నులు చేస్తే ల‌క్ష్మీదేవి క‌టాక్షం క‌లుగుతుందో.. అదే విధంగా ఎలాంటి ప‌నులు చేయకూడ‌దో తెలుసుకుందాం.

ఎవ్వ‌రికీ డ‌బ్బులు అప్పుగా ఇవ్వ‌కండి

ధ‌న‌త్ర‌యోద‌శి రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వ‌డం తీసుకోవ‌డం వంటివి వ‌ద్దు. ల‌క్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలే కానీ వేరొక‌రి ఇంటికి పంప‌కూడ‌దు.

గాజు, ఐర‌న్ వ‌స్తువులు కొన‌కూడ‌దు

ధ‌న త్ర‌యోద‌శి రోజున గాజు, ఐర‌న్, అల్యుమినియం వంటి వ‌స్తువులు కొన‌కండి. ముఖ్యంగా ఐర‌న్ కుక్‌వేర్ మాత్రం అస్స‌లు కొన‌కూడ‌దు. షార్ప్ వ‌స్తువులు కూడా ఇంటికి తెచ్చుకోకూడ‌దు. అంతేకాదు.. న‌లుపు రంగుకి సంబంధించిన‌వి ఏవీ కూడా కొనుగోలు చేయ‌క‌పోవ‌డమే మంచిది. (dhanatrayodashi)

చీపుర్లు

చీపుర్లు ల‌క్ష్మీదేవితో స‌మానం అంటుంటారు. కాబ‌ట్టి ధ‌న త్ర‌యోద‌శి రోజున చీపురు కొంటే మంచిది. చీపుర్ల‌తో పాటు వెండి, బంగారం కొన్నా మంచిదే.

ఉప్పు, ధ‌నియాలు

ధ‌న త్ర‌యోద‌శి రోజున ఉప్పు, ధ‌నియాలు కొంటే ఎంతో మంచిది. నీటిలో కాస్త ఉప్పు వేసి ధ‌న త్ర‌యోద‌శి రోజున ఇల్లు శుభ్రం చేసుకుంటే నెగిటివిటీ పోతుంది. ధ‌నియాల‌ను పూజ‌లో కూడా వాడ‌చ్చు.

ఎలక్ట్రిక్ వ‌స్తువులు, వాహ‌నాలు వ‌ద్దు

ధ‌న త్ర‌యోద‌శి రోజున ఎల‌క్ట్రిక్ వ‌స్తువులు, వాహ‌నాలు వంటికి కొనక‌పోవ‌డ‌మే ఉత్త‌మం. కావాలంటే ధ‌న త్ర‌యోద‌శికి ముందు రోజు ఈ వ‌స్తువుల‌కు కావాల్సిన పేమెంట్స్ చేసుకోవ‌చ్చు. కానీ ధ‌న త్ర‌యోద‌శి రోజున మాత్రం మీ నుంచి డ‌బ్బు పోయే ప‌ని ఏదీ చేయ‌కూడ‌దు.