Double Cardiac Arrest అంటే ఏంటి.. ?
చాలా మంది కార్డియాక్ అరెస్ట్ (cardiac arrest) అన్నా గుండెపోటు (heart attack) అన్నా ఒకటే అనుకుంటారు. కానీ స్వల్ప తేడా ఉంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఒంట్లో పాస్ అయ్యే కరెంట్ సడెన్‌గా ఆగిపోతే.. గుండె ఉన్నట్టుండి ఆగిపోవడం. ఇక హార్ట్ ఎటాక్ అంటే గుండెకు రక్త సరఫరా ఆగిపోవడం. నిజానికి హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ ప్రమాదకరమైనది. ఈ రెండు కాకుండా ఇంకో గుండె సమస్య కూడా ఉంది. అదే డబుల్ కార్డియాక్ అరెస్ట్ (double cardiac arrest). ఇటీవల బ్రెజిల్‌కి చెందిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ డబుల్ కార్డియాక్ అరెస్ట్ బారిన పడి మృతిచెందడంతో ఈ పదం వైరల్‌గా మారింది. అసలు ఏంటీ డబుల్ కార్డియాక్ అరెస్ట్..!
డబుల్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెలోని ఆట్రియా, వెంట్రికల్స్ ఒకేసారి కొట్టుకోవడం ఆపేస్తాయి. సాధారణంగా వచ్చే కార్డియాక్ అరెస్ట్‌లో గుండె కొట్టుకోవడంలో వేరియేషన్స్ కనిపిస్తాయి. దీనినే అరిత్మియా అంటారు. అయితే.. డబుల్ కార్డియాక్ అరెస్ట్ (double cardiac arrest) అనేది అరుదుగా వస్తుంటుంది. మన దేశంలో అయితే హార్ట్ ఎటాక్స్, కార్డియాక్ అరెస్ట్‌ల కేసులే ఎక్కువ. ఫ్యామిలీ హిస్టరీలో సీఏడి (కరోనరీ ఆర్టరీ డిసీస్) ఉన్నవారికి, లేదా రక్తనాళాల్లో పూడికలు ఉన్నవారికి డబుల్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్యలు లేకపోయినా స్మోకింగ్, డ్రింకింగ్, ఒబెసిటీ డ్రగ్స్ తీసుకునేవారికి కూడా ఈ రిస్క్ ఎక్కువే. అయితే డబుల్ కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో బతికి బయటపడటం కష్టమే. ఎందుకంటే సమయానికి వైద్యం అందినా కొన్ని సార్లు ట్రీట్మెంట్ మధ్యలో కూడా డబుల్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని బారిన పడకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్న ఆప్షన్స్‌పై దృష్టి పెట్టాలి. అంటే గుండె పనితీరుని మెరుగు పరిచే ఆహారాలు తీసుకోవడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం, రోజూ వాకింగ్ లేదా జిమ్, యోగా వంటివి చేయడం చేస్తుండాలి. అప్పుడు ఇలాంటి రిస్క్‌ల బారినపడకుండా ఉండే ఛాన్సులు తక్కువగా ఉంటాయి. (double cardiac arrest)