Lifestyle: ఉదయం ఈ 3 పనులు అస్సలు చేయకండి
Hyderabad: మంచి లైఫ్‌స్టైల్‌ని (lifestyle) అలవాటు చేసుకోవాలంటే ఉదయం లేవగానే ఈ మూడు పనులకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. మనం లేవగానే చేసే పనులే ఆ రోజంతా ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. ఇంతకీ అవేంటంటే..
స్నూజ్ బటన్ నొక్కద్దు
ఏదో ఇంపార్టెంట్ పని కాబట్టే ఉదయాన్నే లేవాలని అలారం పెట్టుకుంటాం. మరి అలారం టైంకి మోగగానే ఎందుకు స్నూజ్ చేయాలి చెప్పండి? అలాంటప్పుడు అలారం పెట్టుకుని కూడా వేస్ట్ కదా. అందుకే అలారం పెట్టుకున్నప్పుడు అది మోగగానే లేచేయండి. ఒకవేళ ఆ పని అంత ముఖ్యం కాదు అనిపిస్తే అలారం ఆపేసి పడుకోండి కానీ స్నూజ్ మాత్రం చేయొద్దు. దీని వల్ల నిద్ర క్వాలిటీ తగ్గుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం
బ్రేక్‌ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం. రాత్రి తినేసి నిద్రపోతాం కాబట్టి దాదాపు 9 గంటల పాటు కడుపులో ఏమీ ఉండదు. అలాంటప్పుడు రోజులో మనం తినే ఆహారం మొదలయ్యేది బ్రేక్‌ఫాస్ట్‌తోనే. ఇది చాలా ఇంపార్టెంట్. పనిలో పడి టైం లేక తినలేకపోతుంటారు కొందరు. మరికొందరు బరువు తగ్గాలని తినకుండా ఉంటారు. అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఉదయం లేట్ అవుతుంది అనుకుంటే రాత్రే ఓట్స్ లాంటివి నానబెట్టేసుకోండి. తినాలి కాబట్టి ఏదో ఒకటి తినకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తినండి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
నో సోషల్ మీడియా
లేవగానే ఈమెయిల్స్, సోషల్ మీడియా వద్దు. సోషల్ మీడియా మన బ్రెయిన్ యాక్టివిటీని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. దాంతో మీరు ఉదయాన్నే ఏం చూస్తారో సాయంత్రం వరకు అదే మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ వర్క్ మెయిల్స్ కూడా ఇంపార్టెంటే. కానీ లేవగానే వాటిని చూడద్దు. ఓ గంటసేపు మీకోసం సమయం కేటాయించుకోండి. వర్క్ ఎప్పుడూ ఉండేదే. మీరు బాగుంటేనే కదా మీ కెరీర్ కూడా బాగుంటుంది.