Health: పోర్న్ చూడటం ఎలా మానుకోవాలి?
Health: మన దేశంలో పోర్న్‌కి బానిసలుగా మారిపోతున్నవారు ఎక్కువగానే ఉన్నారు. కానీ దీని గురించి ఎవ్వరూ ఒకరితో ఒకరు చెప్పుకోరు. చాలా మంది నేను చైన్ స్మోకర్ని అని గర్వంగా చెప్పుకుంటారు కానీ.. నేను పోర్న్ చూడకుండా ఉండలేను అని మాత్రం చెప్పుకోలేరు. అప్పుడప్పుడ చూడటం ఓకే. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే.. పోర్న్ చూడటమే పనిగా పెట్టుకున్నప్పుడు. సర్వేల ప్రకారం ఎవరైతే పోర్న్ చూడటానికి అలవాటు పడిపోతారో వారి మీద వారికే సిగ్గేస్తుంది. ఈ అలవాటును వదిలేద్దామన్నా సులువుగా వదులుకోలేరు. ఈ అలవాటే జీవితంలో అడ్డంకిగా మారుతుంది. పోర్న్ అనేది ఒక మోడ్రన్ డే డ్రగ్. చాలా మంది దీనికి బానిసలుగా మారడమే కాకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు. పోర్న్ చూడటం వల్ల వచ్చే శారీరక, మానసికంగా వచ్చే సమస్యల గురించి.. ఎలా బయటపడాలి వంటి విషయాలను తెలుసుకుందాం. (Health)
ఒకప్పుడైతే పోర్న్ చూడటం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు ఎవరైనా ఒక్క క్లిక్‌తో ఎవరైనా పోర్న్ చూసేయొచ్చు. ఇది ఎంతగా మానవ బ్రెయిన్స్‌ని హైజాక్ చేసిందంటే.. దీని నుంచి తప్పించుకోవడం కష్టం. 35% ఇంటర్నెట్ డౌన్లోడ్స్ పోర్న్ మూవీలవే అవుతున్నాయి. చింతించాల్సిన విషయం ఏంటంటే.. పోర్న్ చూసేవారిలో టీనేజర్లే ఎక్కువ. 33% పోర్న్ యూజర్లు ఆడవారే. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ట్విటర్ ఆడియన్స్‌ని తీసుకుంటే.. ఒక నెలకు పోర్న్ సైట్ విజిటర్లే ఎక్కువ. కొంత మంది అంటుంటారు.. నేను నా ప్రైవేట్ స్పేస్‌లోనే పోర్న్ చూస్తున్నాను.. ఎవ్వరికీ హాని చేయడం లేదు అని. దీనినే ట్రాప్ అంటారు. పోర్న్ అనేది 100 బిలియన్ డాలర్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం మీరు చూస్తూ ఉండండి.. మేం జేబులు నింపుకుంటూ ఉంటాం. ఇదే వారి ఉద్దేశం.
పోర్న్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
పోర్న్ వీడియోలను చూడటానికి అలవాటు పడినవారు తమ భాగస్వామ్యులతో సెక్స్ అలాగే చేయాలేమో అనుకుంటారు. అలా ట్రై చేసి ఓడిపోయినవారు ఉన్నారు. దీని వల్ల సెక్స్ సమస్యలు ఉన్నాయేమో అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతుంటాయి. ఫలితంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యలు వస్తాయి. శృంగార సమస్యల నుంచి విడాకులు అక్కడి నుంచి భాగస్వామ్యులపై చేయి చేసుకోవడం, అక్కడి నుంచి మహిళలను ఓ వస్తువుగా తప్పుగా చూడటం.. ఇవన్నీ కూడా పోర్న్ వల్ల వచ్చే సమస్యలే. మీ సోషల్ లైఫ్ కూడా పాడవుతుంది. ఒక స్టేజ్ తర్వాత ఇక పోర్న్ చూడాలని కూడా అనిపించదు. అంతకుమించింది ఇంకేదో కావాలని అనిపిస్తుంది. ఫలితంగా అగాథంలో పడిపోతారు.
ఒక్కటి మాత్రం మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. పోర్న్ అనేది సెక్స్ ఎడ్యుకేషన్ కాదు. దీని నుంచి మనం నేర్చుకునేది ఏదీ ఉండదు. నిజంగా సెక్స్ గురించి అవగాహన రావాలంటే వైద్యులను, ప్రొఫెషనల్స్‌ని, బుక్స్ చదివితే తెలుస్తుంది. అంతేకానీ పోర్న్ చూస్తే పైసా ఉపయోగం ఉండదు.
ఎలా బయటపడాలి?
పోర్న్ వల్ల మీరు సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారా లేదా అన్న విషయాన్ని ముందు తెలుసుకోండి. ఒకవేళ ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే దీనిని పోర్న్ వల్ల కలిగిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే మీ అంగం స్తంభించదు. దీని నుంచి బయట పడాలంటే మీరు ఎంత పోర్న్ చూడటం మానేసినా కూడా పూర్తిగా కోలుకోవడానికి కనీసం 2 నుంచి 5 నెలల సమయం పడుతుంది.
పోర్న్ చూడాలనిపిస్తే దాని బదులు మరేదన్నా మంచి హాబీని ఎంచుకోండి. పోర్న్ చూడటం వల్ల మెదడులో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ దాని నుంచి కాకుండా ఓ మంచి హ్యాబిట్ ద్వారా రిలీజ్ అయ్యేలా ఓ హ్యాబిట్‌ని అలవర్చుకోండి.
వర్కవుట్స్ స్టార్ట్ చేయండి, ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికి వెళ్లండి.. ఇలా ఏదో ఒక పనిని కల్పించుకోండి. క్రమంగా పోర్న్ చూసే అలవాటు నుంచి బయటపడగలుగుతారు. ఏం చేసినా ఏ మార్పూ లేకపోతే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించి తీరాల్సిందే. లేదంటే మొదటికే మోసం వస్తుంది.