Health: మందులు లేకుండా వీర్యకణాల కౌంట్ పెరగాలంటే..!?
Health: శృంగారం విషయానికొచ్చే సరికి చాలా మంది తెగ సిగ్గుపడిపోతుంటారు. కొన్ని విషయాలను చర్చించుకునేటప్పుడు ఛీ ఛీ ఇలాంటివి ఎలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు అని తెగ మొహమాటం ప్రదర్శిస్తుంటారు. భారతదేశ జనాభా మాత్రం 140 కోట్ల వరకు ఉంది. ఇలా పైకి పతీతు మాటలు చెప్పేవారికే అసలు సెక్స్ (Sexual Life) విషయంలో ఎలాంటి అవగాహన ఉండి ఉండదు. సెక్స్ ఎడుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఏదన్నా సమస్య ఉంటే ధైర్యంగా వైద్యులను సంప్రదించాలి. ఇంట్లో కూర్చుని బాధపడుతుంటే సంసారాలు విచ్ఛిన్నం అవ్వడం తప్ప ఏమీ ఉండదు. ఈరోజు హెల్త్ టాపిక్‌లో వీర్యకణాల కౌంట్ పెరగడం గురించి తెలుసుకుందాం.
ఒక సర్వే ప్రకారం భారతదేశం పురుషుల్లో వీర్య కణాల కౌంట్, చిక్కదనం ప్రమాద స్థాయిలో తగ్గిపోతోందట. ఇలా అయితే సంతానోత్పత్తి ఉండదు. సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేరు. ఫలితంగా మానసిక రుగ్మతులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇందుకు ప్రధాన కారణం ప్రస్తుత జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం వంటివి చేయకుండా అనవసరమైన ఒత్తిళ్లకు గురవడమే అని వైద్యులు అంటున్నారు. మరో కారణం ఏంటంటే.. 30 ఏళ్ల దాటిన తర్వాత వివాహాలు చేసుకోవడం. (Health)
స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి మరో కారణం ఏంటంటే.. మగవారు కడుపు బిగించి పట్టుకునేలా టైట్ జీన్స్ వేసుకోవడం. ఒకప్పుడు మగవారు రాత్రి వేళల్లో లుంగీలు కట్టుకుని నిద్రపోయేవారు. కాబట్టి వారికి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఏవీ ఉండేవి కావు. ఇప్పుడు అబ్బాయిలు పడుకునేటప్పుడు కూడా టైట్‌గా ఉండే చెడ్డీలు, షార్ట్స్ వేసుకుంటున్నారు. దీని వల్ల కలిగే ప్రమాదం అంతా ఇంతా కాదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న కాలంలో వివాహితులు చాలా మటుకు సహజంగా పిల్లల్ని కనలేకపోతున్నారు. భార్యభర్తలు సంతాన సాఫల్య కేంద్రాల వద్దే ఎక్కువగా కనిపిస్తున్నారు.
వీర్యకణాల సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే యువకులే ఉన్నారట. ఉద్యోగంలోని ఒత్తిడి వీరి శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి దీనికి పరిష్కారం మందులు వాడటమేనా? మందులు వాడచ్చు కానీ ప్రతిదానికీ మందులు వాడితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే కొన్ని సార్లు మనం తిండే తిండితోనే జబ్బుల్ని నయం చేసుకుంటూ ఉండాలి. తిండి ద్వారా కూడా వీర్యకణాల కౌంట్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎలా తినాలి ఏం తినాలి అనేది వైద్యులను అడిగితే వారు క్లియర్‌గా వివరిస్తారు.
వీర్యకణాల కౌంట్‌ను పెంచే ఆహారాలు ఇవే
గుడ్లు
పాలకూర
అరటిపండ్లు
తోటకూర
డార్క్ చాక్లెట్
వాల్నట్స్
గుమ్మడి విత్తనాలు
జింక్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు
వీటిలో మీ బడ్జెట్‌లో దొరికే ఆహార పదార్థాలను కొనుక్కుని వారంలో మూడు నాలుగు రోజులు తిని చూడండి. ఇలా ఒక నెల పాటు చేసి ఆ తర్వాత మీకు మీరు పరిశీలించుకుంటే మార్పు తెలుస్తుంది. వైద్యులను సంప్రదించినప్పుడు కూడా మందులతో కాకుండా డైట్ రాసిస్తే బాగుంటుంది అని చెప్పండి. జీవనశైలిలో చోటుచేసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు జీవనశైలిని చక్కగా మార్చుకుని ఆ రోగాలను పోగొట్టుకోవాలే తప్ప మందులతో కాదు. ప్రతీ అనారోగ్య సమస్యకు మందులు వేసుకుంటూ పోతే ముందు ముందు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.