Health: శృంగార సమయంలో ఇవి వద్దు..!
Health: శృంగారం అనేది దాంపత్య జీవితంలో ఒక కీలక భాగం. భార్యాభర్తలు ఇద్దరూ దీని గురించి మనసు విప్పి మాట్లాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. చాలా మటుకు గొడవలు ఈ విషయంలోనే వస్తాయి కాబట్టి ఏమున్నా నిజాయతీగా పంచుకోగలిగితే ఆ బంధం నిలబడుతుంది. అయితే శృంగారం సమయంలో కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం.
*మగవారికైనా ఆడవారికైనా ప్రైవేట్ భాగాలు నలుపు రంగులో ఉండకూడదు అనే అపోహలో ఉంటారు. కింద భాగంలో నల్లగా ఉంటే అసహ్యించుకోవడానికి, సిగ్గుపడటానికి ఏమీ లేదు. ఆ భాగంలో నల్లగా ఉన్నంత మాత్రాన రోగాలు ఉన్నట్లు కాదు. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ చూసి రకరకాల క్రీమ్స్ రాసుకుని ప్రైవేట్ భాగాలను తెల్లగా మార్చేసుకోవాలని అనుకుంటున్నారు. దీని వల్ల ఉన్న నలుపు పోతుందో లేదో తెలీదు కానీ నయం కాని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
*మహిళలకు తమ పార్ట్నర్ అంగం సైజులో పెద్దగా ఉండాలని అనుకుంటారు. చిన్నగా ఉంటే వారిని హేళన చేసేవారు కూడా ఉన్నారు. ఇది చాలా తప్పు. అంగం సైజును బట్టి వారి సామర్ధ్యం అంచనా వేయకండి. ఈ విషయాన్ని నలుగురికీ చెప్పేందుకే తెలుగులో ఏక్ మినీ కథ అనే సినిమాను కూడా తీసారు. ఈ విషయంలో మగవారు కుంగిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవారూ లేకపోలేదు. కాబట్టి మీ అంగం చిన్నగా ఉన్నా లేకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు.
*ఆర్గాజం (లైంగిక సంతృప్తి) వస్తేనే బాగా శృంగారం చేసినట్లు అని అనుకుంటారు. మగవారికి ఆర్గాజం వస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. కానీ మహిళలకు అలా కాదు. మహిళలకు ఆర్గాజం రానంత మాత్రాన వారు సెక్స్ విషయంలో వీక్ అన్నట్లు కాదు. కొందరు అమ్మాయిలకు జస్ట్ హార్డ్ రొమాన్స్తోనే సెక్స్ చేసినంత సంతృప్తికరంగా ఉంటారు. కాబట్టి ఆర్గాజం రాలేదని మీ భాగస్వామిని నిందించకండి.
*శృంగారంలో పాల్గొనే ముందు మూడ్ రావడం కోసం పోర్న్ వీడియోలు వంటివి చూడటం మానేయండి. పోర్న్ వీడియోల్లో చూపించేవన్నీ వాస్తవాలు కావు. వారు చేసారు కదా అని మీరు మీ భాగస్వామిపై ప్రయోగాలు చేయకండి. మీకు అంతగా డౌట్లు ఉంటే వివిధ ఆర్టికల్స్ చదివి తెలుసుకోండి. లేదా వైద్యులను అడిగినా వారు మెరుగైన సలహాలు ఇస్తారు.