Eggs: గుడ్ల‌ను వీటితో అస్స‌లు తిన‌కండి

కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఇత‌ర వాటితో క‌లిపి తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు తప్ప‌వు. గుడ్లు (eggs) తినేట‌ప్పుడు వాటిని ఏ ఆహారంతో క‌లిపి తీసుకోకూడ‌దో ఈరోజు తెలుసుకుందాం.

నిమ్మజాతి పండ్లు

గుడ్లు.. నిమ్మ‌జాతి పండ్ల‌ను క‌లిపి ఎప్పుడూ తీసుకోకండి. అంటే నిమ్మ‌, ద్రాక్ష‌, నారింజ వంటి వాటిని గుడ్ల‌తో క‌లిపి తీసుకోవ‌డం కానీ గుడ్ల‌లో వేసి వండ‌టం కానీ చేస్తే గుడ్డులోని పోష‌క విలువ‌లు పోతాయి.

రెడ్ వైన్

రెస్టారెంట్ల‌కు వెళ్లిన‌ప్పుడు రెడ్ వైన్ ఆర్డ‌ర్ చేసుకున్నార‌నుకోండి.. దానిలోకి మంచింగ్‌గా గుడ్డుకు సంబంధించిన ఫుడ్స్‌ని మాత్రం ఆర్డర్ చేయ‌కండి. ఈ రెండూ క‌లిపి తింటే వెగ‌టు పుట్టి వాంతులు అయ్యే అవ‌కాశం ఉంది. (eggs)

చెక్క‌ర క‌లిగిన ఆహారాలు

ఉద‌యాన్నే గుడ్డు తింటే ఎంతో మంచిది అని మ‌న‌కు తెలిసిందే. అయితే గుడ్డుతో పాటు పాల‌ల్లో ఇన్‌స్టంట్ ఫుడ్స్ వంటివి వేసుకుంటే మ‌నం గుడ్డు తిని కూడా వృధా అయిపోతుంది. కాబ‌ట్టి.. పాల‌ల్లో ఓట్స్ వంటివి వేసుకుని తింటే బెట‌ర్.

ఆల్క‌హాల్

ఆల్క‌హాల్ తాగే అల‌వాటుతో పాటు ప‌చ్చి గుడ్ల‌ను తాగే అల‌వాటు ఉంటే మాత్రం వెంట‌నే మానుకోండి. ప‌చ్చి గుడ్డు తాగ‌డం అంత‌గా మంచిది కాదు. ఒక‌ప్పుడు అంటే కాస్తైనా ఆర్గానిక్‌గా ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయాయి. (eggs)

పెరుగు

ఆయుర్వేదం ప్ర‌కారం గుడ్లు, పెరుగు కూడా మంచి కాంబినేష‌న్ కాద‌ట. కాబ‌ట్టి చూసుకుని తినడం మంచిది.