Yahya Sinwar: యావత్ ప్రపంచానికే ముప్పు..ఎవరితను?
పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూసారా? ఏదో చూడటానికి అధికారిలా కనిపిస్తున్నాడు కానీ.. ఇతను కరుడుగట్టిన ఉగ్రవాది. ఇతని పేరు యాహ్యా సిన్వార్ (yahya sinwar). ఇతని పేరులోనే పాపం (sin) యుద్ధం (war) ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై భీకర మెరుపు దాడులకు పాల్పడిన మాస్టర్‌మైండ్ ఈ సిర్వారే. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో సిన్వార్‌పై అతని బృందంపై తమ టార్గెట్ ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు తెలిపారు.
నరరూప రాక్షసుడు
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో 1962లో సిన్వార్ పుట్టి పెరిగాడు. ఇజ్రాయెల్ ఇతన్ని ఖాన్ యూనిస్ నరరూప రాక్షసుడు అని సంబోధిస్తుంటుంది. గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్‌లో సన్వార్ డిగ్రీ పట్టా పొందాడు.
24 ఏళ్లు జైల్లో
సిన్వార్ 24 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ జైల్లో మగ్గాడు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఇతన్ని ఇజ్రాయెల్ 1982లో అరెస్ట్ చేసింది. అదే సమయంలో సలామ్ షెహజాదే అనే వ్యక్తితో కలిసి ఓ ఉగ్ర కూటమిని ఏర్పాటుచేసి ఇజ్రాయెల్ గూఢచారులను టార్గెట్ చేస్తుండేవాడు. 2002లో ఇజ్రాయెల్ బలగాలు షెహజాదాను మట్టుబెట్టాయి. (yahya sinwar)
1987లో హమాస్ సంస్థ ఏర్పాటయ్యాక.. అదే సంస్థలో సిన్వార్ మరో యూనిట్‌ను ప్రారంభించాడు. 1988లో ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్న ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, నలుగురు పాలెస్తీనా సైనికులను చంపేసాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసి నాలుగు జీవిత ఖైదులు విధించింది.
విడుదల
2006లో హమాస్ మిలిటరీ వింగ్ ఇజాద్దిన్ అల్ ఖసమ్ సిబ్బంది ఓ సొరంగం ద్వారా ఇజ్రాయెల్ భూగోళంలోకి ప్రవేశించి అక్కడి సైనికులపై దాడులు చేస్తుండేవారు. ఆ సమయంలో ఇద్దరు ఇజ్రాయెల సైనికులు చనిపోగా గిలాద్ షలిత్ అనే సైనికుడిని కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత ఖైదీల ఎక్స్‌చేంజ్ ప్రక్రియలో భాగంగా 2011లో షలిత్‌ను వదిలేసారు. అలా విడుదలైన ఖైదీల్లో సిన్వార్ ఒకరు.
అప్పటినుంచి సిన్వార్ చర్యలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. 2015లో అమెరికా మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదుల్లో సిన్వార్ పేరును చేర్చింది. 2017లో సిన్వార్ హమాస్ సంస్థ అధినేతగా మారాడు. హమాస్ కీలక నేతల్లో మొదటి వ్యక్తి ఇస్మాయిల్ హనియే అయితే.. రెండోది సిన్వారే. హమాస్ చేపట్టే ప్రతి పనులు, చర్యలపై సిన్వార్ నిఘా ఉంటుంది. ఇతను హమాస్ చేసే చర్యల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే.. ఇసుమంత అవమానం కలిగినా వారిని చంపేస్తుండేవాడు. హమాస్ సంస్థలో మహమూద్ ఇష్టివి అనే కమాండర్ 2015లో హమాస్‌కు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తెలిసి అతన్ని ఉరితీసి చంపేసారు. ఇప్పుడు ఈ సిన్వార్‌ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్ సైన్యానికి ఉన్న ప్రధాన టార్గెట్లలో ఒకటి. (yahya sinwar)