Ayodhya Ram Mandir సిబ్బంది జీతాలెంతో తెలుసా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామ మందిరాన్ని (ayodhya ram mandir) నిర్మిస్తున్నారు. ఇంకొన్ని నెలల్లో ఈ అద్భుతమైన కట్టడం పూర్తవుతుంది. అయితే ఈ ఆలయ సిబ్బంది వారి జీతాలు ఎంతుంటాయో తెలుసా? ఆలయంలో ఐదుగురు పూజారులు ఉంటారు. వీరిలో ఒకరు ప్రధాన అర్చకులుగా ఉంటారు.
వీరికి జీతాలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ నుంచి వస్తాయి. ఆచార్య సత్యేంద్ర దాస్ అనే వ్యక్తి అయోధ్యలో 28 పాటు అర్చకులుగా ఉన్నారు. ఈయనకు నెలకు రూ.32,900 ఇస్తారు. మిగతా సహాయ పూజారులకు రూ.31,000 జీతాలుగా ఇస్తారు. ఇక ఆలయ క్లెర్క్‌లు, షాపుల సిబ్బందికి రూ.24,440 జీతంగా ఇస్తారు. ఆలయ సేవకులకు కూడా రూ.24,440 ఇస్తారు. రాబోయే సంక్రాంతికి ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో ఆయోధ్య రామ మందిరాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi). ఆయన ఆధ్వర్యంలో రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. (ayodhya ram mandir)