Realme: రియల్మీ నుంచి ప్రపంచంలోనే వేగవంతమైన ఛార్జర్
Realme: చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నుంచి అద్భుతమైన ప్రొడక్ట్ మార్కెట్లోకి తేనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చార్జర్‌ను ప్రవేశపెట్టనుంది. దీని స్పీడ్ 320W. అయితే ఏ మోడల్ ఫోన్‌కి ఈ వేగవంతమైన చార్జింగ్ ఆప్షన్ ఉంటుంది అనేది రియల్మీ త్వరలో వెల్లడించనుంది. గతంలో రియల్‌మి GT 3 స్మార్ట్‌ఫోన్‌తో 240W ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.
ఇక ఇంతకుమించిన వేగవంతమైన చార్జర్‌తో టెక్నాలజీ రంగంలోనే సంచలనం సృష్టించనున్నట్లు తెలిపింది. ఈ చార్జర్‌కి ఉండే చార్జింగ్ స్పీడ్ 4,420mAh వరకు ఉంటుందట. ఈ చార్జర్‌తో 4 నిమిషాల 30 సెకెన్లలో ఫోన్ చార్జింగ్ అయిపోతుంది. మరోపక్క షామీ 300W చార్జర్ 4,100mAh వరకు ఉంది. దీని వల్ల 5 నిమిషాల్లో చార్జింగ్ ఎక్కేస్తుంది. రియల్మీ 4,420 mAh ఫోల్డబుల్ బ్యాటరీని కూడా ప్రవేశపెట్టనుంది.
వేగవంతమైన చార్జర్లు మంచివేనా?
వేగవంతమైన చార్జర్లు కాలిపోయి కరెంట్ షాక్‌కు గురిచేసే అవకాశం ఉంది. వినియోగదారుల రక్షణ దృష్యా రియల్మీ చార్జర్ కాలిపోకుండా ఉండేందుకు ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఇన్‌బిల్ట్ చేస్తోంది. ఈ ట్రాన్స్ఫార్మర్కి కాంటాక్ట్ ఫ్రీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కన్వర్షన్ ఉంటుంది. దీని వల్ల వోల్టేజ్ 20 వోల్ట్స్ తగ్గుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.