Shikhar Dhawan: నాక్కూడా న‌చ్చావ్.. యాంక‌ర్‌తో గబ్బ‌ర్ పులిహోర‌!

Shikhar Dhawan: క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న యాంక‌ర్‌తో పులిహోర క‌ల‌ప‌డం వైర‌ల్‌గా మారింది. హ్యూమ‌న్స్ ఆఫ్ బొంబాయ్ పాడ్‌కాస్ట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శిఖ‌ర్‌ను.. యాంక‌ర్ క‌రిష్మా మెహ‌తా ఇంట‌ర్వ్యూ చేసారు.

ఈ నేప‌థ్యంలో యాంక‌ర్‌కు శిఖ‌ర్‌కు మ‌ధ్య లా ఆఫ్ ఎట్రాక్ష‌న్ టాపిక్ వ‌చ్చింది. దీని గురించి యాంక‌ర్ మాట్లాడుతూ.. నేను ఈ లా ఆఫ్ ఎట్రాక్ష‌న్ కాన్సెప్ట్‌ను బాగా న‌మ్ముతాను. నిన్న దీని గురించి వ‌ర్క్‌షాప్ కూడా జ‌రిగింది అంది. దీనికి శిఖ‌ర్ బ‌దులుగా.. మీరు న‌న్ను కూడా ఎట్రాక్ట్ చేసారు అని ఫ్ల‌ర్ట్ చేసాడు.