బాలికకు లిప్‌కిస్ ఇచ్చిన మహిళా పోలీస్
Police: మహిళలను కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారిణే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. కలకత్తా వైద్యురాలి పట్ల హత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ల సంరక్షణ కోసం పింక్ మొబైల్ వ్యాన్లు ప్రవేశపెట్టింది. ఈ వ్యాన్లు రాత్రంతా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో సిలిగురి ప్రాంతంలో తనియా రాయ్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తాగి డ్యూటీకెక్కింది. ఇద్దరు బాలికలు నడుచుకుంటూ వెళ్తుండగా వారిని ఆపి వివరాలు ఆరా తీసింది. మీ నుంచి మందు వాసన వస్తోంది మేడమ్ దూరంగా ఉండండి అని ఆ బాలికలు అనడంతో.. ఒట్టు నేను తాగలేదు.. కావాలంటే చూడూ అని ఓ బాలికకు లిప్ కిస్ ఇచ్చింది. దీనిని వీడియో తీయడంతో సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. దాంతో తనియా రాయ్‌ను వెంటనే సస్పెండ్ చేసారు.