Sleep Shopping: నిద్రలో రూ.3 లక్షల షాపింగ్ చేసేసింది..!
Sleep Shopping: నిద్రలో కలవరించే వారిని చూసాం.. నిద్రలో లేచి స్లీప్ వాకింగ్ చేసేవారినీ చూసాం. కానీ నిద్రలో షాపింగ్ చేసేవారి గురించి ఎప్పుడైనా విన్నారా? పై ఫోటోలో కనిపిస్తున్న మహిళకు ఈ స్లీప్ షాపింగ్ అలవాటు ఉందట. ఈ అలవాటు వల్ల నిద్రలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3 లక్షల విలువైన వస్తువులను ఆన్‌లైన్‌లో కొనేసింది.
ఇంగ్లాండ్‌కి చెందిన కెల్లీ అనే 42 ఏళ్ల మహిళకు అరుదైన నిద్ర రుగ్మతి ఉంది. 2006లో కెల్లీకి బిడ్డ పుట్టాక స్లీప్ వాకింగ్ అలవాటైందట. ఆ స్లీప్ వాకింగ్ కాస్తా మెల్లిగా స్లీప్ షాపింగ్‌కి దారితీసింది. అలా నిద్రలోనే షాపింగ్ చేసేస్తోందట. ఓసారి నిద్రలో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ స్కాంకు కూడా గురైందట. 2010లో తన స్లీప్ షాపింగ్ కారణంగా ఉదయం లేచి చూడగానే ఫుట్‌బాల్ కోర్టు మొత్తం డెలివరీ అయ్యిందట. వీటితో పాటు సామాన్లు, సరుకులు, విలువైన వస్తువులు కూడా డెలివర్ అయ్యేవి. ఇలా రాత్రి నిద్రలో షాపింగ్ చేసేయడం.. ఆ వస్తువులు డెలివరీ అయిన రోజు రిటర్న్ చేసేయడం కెల్లీకి అలవాటైపోయింది. అయితే కొన్నిసార్లు రిటర్న్ ఇవ్వలేని వస్తువులను తన వద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ స్లీప్ షాపింగ్ రుగ్మతిని పారాసోమ్నియా అంటారు. అంటే నిద్రలోనే అన్ని పనులు చేసేస్తుంటారు. ఈ రుగ్మతి ఉన్నవారు నడవడం, మాట్లాడటం, తినడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ పనులు చేస్తున్నట్లు మాత్రం వారికి తెలీదు.