Bribe: మొద‌టి రోజే లంచం..!

Jharkhand: గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం అన‌గానే లంచాలు (bribe) బాగా తీసుకోవ‌చ్చు అనుకుంటారు. అలాగ‌ని చేరిన మొద‌టిరోజే చేతివాటం ప్ర‌ద‌ర్శించేసింది ఓ మ‌హిళ‌. జార్ఖండ్‌లో (jharkhand) ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మిథాలీ శర్మ అనే మ‌హిళ కోఆప‌రేటివ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్‌కి ఎంపికైంది. నిన్న‌నే ఆమె ఉద్యోగంలో చేరింది. కోద‌ర్మా వ్యాపార స‌హ‌యోగ్ స‌మితి ఫైల్‌కి సంబంధించి సంత‌కం పెట్టాలంటే రూ.20,000 లంచం (bribe) ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది.

అంతా స‌రిగ్గానే ఉంది క‌దా మేడ‌మ్ అని బాధితులు రిక్వెస్ట్ చేస్తే.. అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌ని ఫైల్ మూసేయ‌డానికి క్ష‌ణం ప‌ట్ట‌దు అని బెదిరించింది. దాంతో ముందు రూ.10,000 ఇస్తాం అని చెప్పి బాధితులు యాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో అధికారుల‌కు స‌మాచారం అందించారు. వాళ్లు వేసిన ప్లాన్ ప్ర‌కారం స‌హ‌యోగ్ స‌మితి వ్యాపారులు లంచం డ‌బ్బులు ఇవ్వ‌డానికి మిథాలీ శర్మ క్యాబిన్‌లోకి వెళ్లారు. సాధార‌ణ వ్య‌క్తుల గెట‌ప్‌లో వ‌చ్చిన ఏసీబీ అధికారులు ఆమెకు డ‌బ్బులు ఇస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాంతో ఉద్యోగంలో చేరిన రోజే ఆమె స‌స్పెండ్ అయ్యారు.