Chandrayaan 3: ఆ ఫొటోని డిలీట్ చేసిన ఇస్రో
చంద్రయాన్ 3కి (chandrayaan 3) సంబంధించి ఓ ఫొటోను ఇస్రో (isro) డిలీట్ చేసింది. ఇందుకు కారణం.. ఆ ఫోటోను తీసింది చంద్రయాన్ 2కి (chandrayaan 2) చెందిన కెమెరా. చంద్రయాన్ 3కి చెందిన ల్యాండర్‌కు చంద్రయాన్ 2కి చెందిన ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా (OHRC) అమర్చారు. చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయినప్పటికీ దీని కెమెరా పనితనం అమోఘంగా ఉంటుంది. అయితే చంద్రయాన్ 2 ఆర్బిటర్ కెమెరా తీసిన ఫొటోను ఇస్రో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్ చేసేసింది. అయితే ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని మాత్రం ఇస్రో వెల్లడించలేదు.