Chandrayaan 3: భూమివైపు వచ్చి కూలిపోయిన భాగం
Chandrayaan 3: ఇస్రో (isro) విజయవంతంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 రాకెట్‌లోని కొంత భాగం భూమికి దగ్గరగా వచ్చి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి పెసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్‌ను LVM3 M4 వెహికిల్ లాంచ్ చేసింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2.42 గంటల సమయంలో LVM3 M4కి సంబంధించిన కొంత భాగం భూమికి దగ్గరగా వచ్చి కూలిపోయింది.
చంద్రయాన్ 3ని లాంచ్ చేసి ఇప్పటికి 124 రోజులు అవుతోంది. కాబట్టి లాంచ్ వెహికిల్‌లోని భాగాలు నెమ్మదిగా భూమికి దగ్గరగా వచ్చి కూలిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియేనని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రాకెట్‌కి సంబంధించి ఏ భాగం విడిపోయినా అది ఎవ్వరికీ హాని కలిగించకుండా ఉండేందుకు ముందుగానే దానిలోని రసాయనాలను ముందే తొలగించేసామని ఇస్రో వెల్లడించింది.