ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక.. గుంత తవ్వినందుకే పది వేలు!
Wadi Al-Salam: శ్మశాన వాటికకు కూడా గిన్నీస్ బుక్‌లో (Guinness Book of World Records) రికార్డు ఉందని మీకు తెలుసా? పై ఫోటోలో కనిస్తున్నది బిల్డింగులు కాదు. అవన్నీ సమాధులే..! ఈ శ్మశాన వాటిక పేరు వాదీ అల్ సలామ్. ఇరాక్‌లోని నజఫ్ అనే ప్రాంతంలో ఉంది. ఏడాదికి 50 వేల మృతదేహాలను ఇక్కడ సమాధి చేస్తుంటారు.
ప్రస్తుతానికి ఇక్కడ 60 లక్షలకు పైగా సమాధులు ఉన్నాయి. UNESCO గుర్తింపు పొందిన ఈ శ్మశాన వాటికలో ఒక సమాధి కట్టడానికి, గుంత తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. ఒక గుంత తవ్వేందుకు దాదాపు రూ.10,000 తీసుకుంటారు. ఇక సమాధి కట్టాలంటే రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది. వివిధ దేశాలకు చెందిన రాజులు, రాణుల శవాలను కూడా ఇక్కడే సమాధి చేసారట. మహమ్మద ప్రవక్త అల్లుడు అయిన ఇమామ్ అలీ ఇబన్ అబీ తలీబ్‌ను కూడా ఇక్కడే సమాధి చేసారు. ఈ శ్మశాన వాటిక ఉన్న విస్తీర్ణంలో 1700 ఫుట్‌బాల్ ఫీల్డ్‌లను నిర్మించవచ్చు.