Dil Raju అల్లుడి కారు దోపిడీ.. కేటీఆరే అలా చేయమన్నాడట
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) అల్లుడు అర్చిత్ రెడ్డి (archit reddy) పోర్షే (porche) కారు దొంగతనానికి గురైంది. శుక్రవారం అర్చిత్ రెడ్డి తన పోర్షే కారులో దసపల్లా హోటల్‌కు పనిమీద వెళ్లారు. పార్కింగ్ చేయమని చెప్పి ఆయన హోటల్ లోపలికి వెళ్లి బయటికి వచ్చి చూడగానే కారు మాయమైపోయింది. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా కారు ఆచూకీ తెలుసుకోగలిగారు. అందులో ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా.. KTR, ముఖేష్ అంబానీలే తనను ఈ కారు దొంగిలించమన్నారని చెప్పాడు. అది విని పోలీసులు షాకయ్యారు. యువకుడి వివరాలు ఆరా తీయగా అతను మానసిక రోగని వెల్నెస్ సెంటర్ నుంచి తప్పించుకున్నాడని తెలిసింది.