Whatsapp New Feature: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్

Whatsapp New Feature:  ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అదిరిపోయే ఓ కొత్త ఫీచర్ రాబోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫీచ‌ర్‌నే వాట్సాప్‌లోనూ తీసుకురావాల‌ని మెటా సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. ఇంత‌కీ ఏంటా ఫీచ‌ర్ అంటే.. ఇప్పుడు మ‌న‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ‌రైనా స్టోరీలో మిమ్మ‌ల్ని మెన్ష‌న్ చేస్తే.. మీకు వెంట‌నే మిమ్మ‌ల్ని మెన్ష‌న్ చేసారు అనే నోటిఫికేష‌న్ వ‌స్తుంది.

ఇప్పుడు ఇలాంటి ఫీచ‌రే వాట్సాప్‌లో రానుంది. ప్ర‌స్తుతానికైతే వాట్సాప్‌లో కేవ‌లం స్టోరీనే పెట్ట‌చ్చు. ఇప్పుడు ఆ స్టోరీలో ఎవ‌ర్నైనా మెన్ష‌న్ చేసే ఫీచ‌ర్ రాబోతోంది. అలా మెన్ష‌న్ చేయ‌గానే ఎవ‌ర్నైతే మెన్ష‌న్ చేసారో వారికి నోటిఫికేష‌న్ వెళ్తుంది. కాంటాక్ట్స్‌ని ట్యాగ్ చేసేందుకు క్యాప్ష‌న్ బార్‌లోనే ఈ ఆప్ష‌న్ ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు స్టోరీలో ఎవ‌ర్ని మెన్ష‌న్ చేసినా ఇత‌రుల‌కు కూడా క‌నిపిస్తుంది. కానీ వాట్సాప్‌లో ఆ ఆప్ష‌న్ లేదు. ఎవ‌ర్నైతే మెన్ష‌న్ చేస్తారో వారికి మాత్ర‌మే మెన్ష‌న్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మిగ‌తావారికి కేవ‌లం స్టోరీ క‌నిపిస్తుంది. త్వ‌ర‌లో మెటా వాట్సాప్‌లో వాయిస్ ఆప్ష‌న్స్‌ని కూడా తీసుకురానుంది.