whatsapp: 5 తప్పులు చేస్తే మీ అకౌంట్ బ్లాక్!
vijayawada: మీరు వార్తలు రాసే జర్నలిస్టులైనా.. లేదా.. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర సామాన్య ప్రజానీకం అయినా.. తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్ యాప్(whatsapp) ద్వారా హత్యలు, రేప్‌లు, 18+ కంటెంట్ వీడియోలు, చిత్రాలు వేరే ఎవరికైనా షేర్ చేసినా, ఫార్వార్డ్ చేసినా ఇకపై జర భద్రం. ఇలా చేస్తున్న వారిని వాట్సాప్ బ్యాన్ చేస్తోందట. ఇలా నెలకు దాదాపుగా 35 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేస్తోందని సమాచారం. అయితే.. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. మాత్రం మీ వాట్సప్ చాలా సేఫ్‌గా ఉంటుందట. మరి అవేంటో తెలుసుకుందాం.
రోజూ వాట్సప్‌కు వందల కొద్దీ ఫార్వాడ్ మెసేజ్‌లు ఫోన్లకు వస్తుంటాయి.. అయితే అందులో ఏ వార్త నిజం అనేది తెలుసుకోకుండా.. ఇతరులకు పంపవద్దని వాట్సప్ యాజమాన్యం సూచిస్తోంది. దీంతోపాటు అధికంగా ఫార్వాడ్ మెసేజులు పంపేవారి ఖాతాలు బ్లాక్ చేసే అవకాశం ఉందట. దీంతోపాటు.. బల్క్ మెసేజింగ్‌ను నివారించాలని వాట్సాప్ సూచిస్తోంది. దీని కోసం వాట్సాప్ మెషీన్ లెర్నింగ్‌ని ఉపయోగిస్తుంది. అలాగే, యూజర్ రిపోర్టుల ఆధారంగా, అవాంఛిత సందేశాలు పంపిన వారిపై చర్యలు తీసుకోనుంది. అనుమతి లేకుండా గ్రూప్‌లో కొత్త కాంటాక్ట్‌ని యాడ్ చేయడం కూడా తప్పేనట. వాట్సాప్ యూజర్ల అనుమతి తర్వాత మాత్రమే గ్రూప్‌లో చేర్చుకోవాలని సూచిస్తోంది. తెలియని కాంటాక్ట్‌లకు మెసేజ్ చేయవద్దని.. వాట్సాప్ చెబుతోంది. ఏదైనా తెలియని నంబర్‌కు సందేశం పంపడం వల్ల ఇబ్బందుల్లో పడతారని హెచ్చరిస్తోంది. దీన్ని బట్టి సందేశాలు, సమాచారం ఇతరులకు పంపేముందు ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది.