Maya Gang: ఢిల్లీని వణికించిన 18 ఏళ్ల గ్యాంగ్‌స్టర్!
పై ఫొటోలో కనిపిస్తున్న యువకుడిని చూసారా? ఇతనికి పట్టుమని 18 ఏళ్ల వయసు కూడా లేదు అప్పుడే మర్డర్లు మొదలుపెట్టేసి మాయా పేరుతో ఓ గ్యాంగ్‌ను (maya gang) నడుపుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ మొత్తం ఇతని గురించే మాట్లాడుకుంటోంది. ఎందుకంటే.. రెండు రోజుల క్రితం ఢిల్లీలో అమెజాన్‌లో మేనేజర్‌గా (amazon manager) పనిచేస్తున్న వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా చంపేసాడు. ఇతని పేరు మహమ్మద సమీర్. ఇతనికి మాయా అనే మరో పేరు కూడా ఉంది. 18 ఏళ్లు వచ్చేటప్పటికే ఇతనిపై నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి. ఇతను ఇన్‌స్టాగ్రామ్‌లో గన్నులు పట్టుకుని రీల్స్ చేస్తుంటాడు. ఈ సమీర్‌కి ఇన్‌స్టాలో 2000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అమెజాన్ మేనేజర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఇతన్ని, ఇతనికి సహకరిస్తున్న బిలాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. (maya gang)
అసలు కేస్ ఏంటి?
మంగళవారం ఢిల్లీలోని అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నా హర్‌ప్రీత్ గిల్, అతని మామ గోవింద్ కలిసి రాత్రి 10:30 ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్నారు. వారు వెళ్తున్న రూట్‌లో రెండు వాహనాలు పట్టనంత చిన్నగా ఉంటుంది. అదే సమయంలో మాయా గ్యాంగ్ మెంబర్స్ పార్టీ నుంచి వస్తున్నారు. దాంతో హర్‌ప్రీత్ బైక్.. సమీర్ బైక్ ఢీకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలకు గొడవ జరిగింది. ఎప్పుడూ చేతిలో గన్నుతో తిరిగే సమీర్.. హర్‌ప్రీత్, గోవింద్‌లను షూట్ చేసాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. హర్‌ప్రీత్ అక్కడికక్కడే చనిపోగా.. గోవింద్ హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (maya gang)