Gandhi Hospital: గాంధీ హాస్పిటల్లో ఏం జరుగుతోంది? 48 పసికందులు ఎలా చనిపోయారు?
Gandhi Hospital: హైదరాబాద్లో ప్రముఖ ప్రభుత్వ హాస్పిటల్గా పేరుగాంచిన గాంధీ హాస్పిటల్లో ఏం జరుగుతోంది. ఒక నెలలోనే 48 మంది పసికందులు 14 మంది తల్లులను వైద్యులు పొట్టనబెట్టుకున్నారా? తెలుగు స్క్రైబ్ అనే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..
అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, పౌష్టిక ఆహార లోపం కారణంగా గర్భంతో ఉన్న 14 మంది మహిళలు మరియు 48 మంది అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు చనిపోయారు. ఈ విషయం 15 రోజులుగా బయటికి పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం దాస్తూ వచ్చింది.
గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార లోప సమస్యలను అధిగమించేందుకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్లను ఆపేసారు. దాంతో పోషకాహారం లేక తక్కువ బరువుతో పుడుతూ పసికందులు చనిపోతున్నారు. అనుభవం లేని డాక్టర్లు ఆపరేషన్లు చేస్తుండటంతో గర్భిణులు మృత్యువాతపడుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం ఒక్క గాంధీ హాస్పిటలోనే ఇన్ని మరణాలు ఉంటే అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 8 నెలల్లో చాలా మంది గర్భిణీలు చిన్న పిల్లలు చనిపోయి ఉండే అవకాశం ఉంది.
గాంధీ హాస్పిటల్లో గమనించిన మరికొన్ని సమస్యలు..
1. గాంధీలో రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ లేదా సీనియర్ డాక్టర్ ఉండాల్సిన స్థానంలో రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ రామయ్యని నియమించారు.
2. ఫ్యామిలీ & హెల్త్ డిపార్ట్మెంట్ మరియు చాలా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 4 నెలల నుంచి జీతాలు లేవు.
3. ఎక్పీరియన్స్ డాక్టర్లను గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, గాంధీలో హైరిస్క్ కేసులు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన డాక్టర్స్ హ్యాండిల్ చేయలేక పోతున్నారు అందువల్ల డెత్స్ ఎక్కువ అవుతున్నాయి.
4. గాంధీ హాస్పటల్లో అసలు రివ్యూ జరగడం లేదు.
5. కేసీఆర్ కిట్ మరియు న్యూట్రిషన్ కిట్ 6 నెలల నుంచి ఆపివేశారు.
6. గాంధీలో గత ప్రభుత్వం ఇన్ ఫీటిలిటీ సెంటర్ మొదలు పెడితే కాంగ్రెస్ గవర్మెంట్ వచ్చిన అప్పటినుంచి ఒక్క కేసు కూడా ఫిటీలిటీ ట్రీట్మెంట్ చేయలేదు.. ఫీటిలిటి సెంటర్ మూసేసారు.
7. గాంధీ మెడికల్ కాలేజీలో సుమారు 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్న D.E.O లను ఎలాంటి కారణం లేకుండా బడ్జెట్ లేదు అని తొలగించారు.
వీటన్నింటిపై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.