Chandrayaan 3: మ‌సాలా దోస‌, కాఫీ చేసిన మాయ‌…!

చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) విజ‌య‌వంతం కావ‌డానికి మ‌న ఇస్రో శాస్త్రేవేత్త‌లు రాత్రింబవ‌ళ్లు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెలిసిందే. అయితే వారు త‌మ టైమింగ్స్‌కి మించి పనిచేసినందుకు గానూ కేంద్ర ప్ర‌భుత్వం వారికి అధిక జీతాలు, బోన‌స్‌లు ఏమీ ఇవ్వ‌లేదు. సాయంత్రం వేళ‌ల్లో రోజూ ఉచితంగా మ‌సాలా దోస‌, కాఫీలే వారిని రెట్టింపు ఉత్సాహంతో ప‌నిచేసేలా చేసాయ‌ట‌. ఈ విష‌యాన్ని మాధ‌వ‌న్ నాయ‌ర్ అనే శాస్త్ర‌వేత్త ఓ సంద‌ర్భంలో మీడియా ద్వారా వెల్ల‌డించారు. సాయంత్రం శాస్త్రవేత్త‌ల‌కు మ‌సాలా దోస‌, కాఫీ ఇచ్చిన‌ప్పుడు వారు కార్యాల‌యంలోనే ఎక్కువ సేపు ఉండి ప‌నిచేసుకునేవార‌ని ఎప్పుడూ కూడా ఎంత సేపు ఉండాలి అని కోప‌గించుకోలేద‌ని తెలిపారు. డ‌బ్బు కోసం కాకుండా మ‌న‌సు పెట్టి మ‌న దేశం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసారు కాబ‌ట్టే చంద్ర‌యాన్ 3 విజ‌యవంతం అయ్యింది. (chandrayaan 3)