USA: భారతీయులకు శుభవార్త
గ్రీన్ కార్డు (green card) కోసం దాదాపు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు (indians) అమెరికా (usa) ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EAD) వర్తింపు గడువుని ఐదేళ్లకు పెంచనుంది. అయితే ఇది కేవలం కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ కేటగిరీకి చెందినవారికే వర్తిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గ్రీన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొందరు భారతీయులకు కాస్త ఊరట కలగనుంది.
ఎవరికి ఈ EAD వర్తిస్తుంది?
*రక్షణ కోసం అమెరికాలో తలదాచుకుంటున్నవారికి ఇది వర్తిస్తుంది. వారిని బలవంతంగా ప్రమాదకర ప్రదేశాలకు పంపించేయకుండా ఈ అప్లికేషన్ కాపాడుతుంది.
*గ్రీన్ కార్డులకు అప్లై చేసుకున్నవారికి.
*డిపోర్టేషన్ బారిన పడకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఎందుకు వారిని డిపోర్ట్ చేయకూడదు అనే అంశాలను క్లియర్‌గా అధికారులకు వెల్లడించాలి. వారు చెప్పేదానిలో న్యాయం ఉంటేనే EAD ఇస్తారు.
అయితే ఎవరికైనా EAD రిజెక్ట్ అయితే మాత్రం వారికి ఇప్పుడు ప్రవేశపెట్టిన ప్రక్రియ వర్తించదు. ఎందుకంటే వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను బట్టే EAD ఇస్తారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో దాదాపు 1.8 మిలియన్ మంది గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తవడానికి మరో 120 ఏళ్లు పడుతుందని ఆల్రెడీ ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది. (usa)