US Visa Applications: భార‌తీయుల‌కు అమెరికా శుభ‌వార్త‌

US Visa Applications increased for indians

 

US Visa Applications: భార‌తీయుల‌కు అమెరికా శుభ‌వార్త చెప్పింది. భార‌తీయ‌ ప‌ర్యాట‌కుల‌కు, వ‌ర్క‌ర్ల‌కు, విద్యార్థుల కోసం 250,000 అద‌న‌పు వీసా అపాయింట్మెంట్ల‌కు క‌ల్పిస్తున్న‌ట్లు అమెరిక‌న్ ఎంబ‌సీ వెల్ల‌డించింది. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికా భార‌తీయ విద్యార్థులకు అద‌నంగా 140,000 వీసాల‌ను జారీ చేసింది. అమెరికా వీసాలు పొందుతున్న దేశాల్లో భార‌త్ టాప్ స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కే అమెరికా దాదాపు 10 ల‌క్ష‌ల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల‌ను వ‌రుస‌గా రెండో ఏడాది క్లియ‌ర్ చేసింది.

2024 స్టూడెంట్ వీసా సీజ‌న్ స‌మ‌యంలో తొలిసారి ద‌ర‌ఖాస్తు చేస్తున్న స్టూడెంట్స్‌కి ప్ర‌తి ఐదు వీసా కార్యాల‌యాల్లో ఒక కార్యాల‌యం నుంచి అపాయిట్మెంట్ డేట్ దొరికేది. దొరుకుతోంది. అలా ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగుప‌డేందుకు త‌మ దేశ అధ్య‌క్షుడు జో బైడెన్, భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోదీ సెట్ చేసిన గోల్‌ని అమెరికా చేధించింద‌ని అమెరిక‌న్ దౌత్యాధికారి ఎరిక్ గార్సెట్టి వెల్ల‌డించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీసాను ప్రాసెస్ చేస్తున్న టాప్ 4 న‌గ‌రాలు హైద‌రాబాద్, ముంబై, చెన్నై, న్యూఢిల్లీ మాత్ర‌మేన‌ని వెల్ల‌డించారు. అమెరికాలో ఏటా 1 మిలియ‌న్ విదేశీ విద్యార్థులు వ‌స్తుంటార‌ని.. వారిలో 25 శాతం భార‌తీయులు ఉన్నార‌ని తెలిపారు.