విమాన సిబ్బందితో సెక్స్ చేయ‌బోయిన ప్ర‌యాణికుడు

US man tries to open plane doors and have sex with crew

 

Viral News: గాల్లో ఉన్న విమానంలో ఓ ప్ర‌యాణికుడు వికృతంగా ప్ర‌వ‌ర్తించాడు. అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో ప్ర‌యాణిస్తున్న ఎరిక్ నికోలాస్ అనే 26 ఏళ్ల యువ‌కుడు ఉన్న‌ట్టుండి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తంచ‌డం మొద‌లుపెట్టాడు. త‌న సీటు నుంచి లేచి విమాన సిబ్బంది ద‌గ్గ‌రికి వెళ్లి త‌న‌తో సెక్స్ చేయాలంటూ వారి ముందు ప్యాంట్ జిప్ విప్పాడు. వారిపై కేక‌లు వేసాడు. దాంతో వెంట‌నే ఇత‌ర ప్ర‌యాణికులు సిబ్బంది క‌లిసి అత‌ని కాళ్లు, చేతులు క‌ట్టేసారు. విమానం ల్యాండ్ అయ్యాక అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోను పోలీసుల‌కు ఇవ్వ‌డంతో అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేసారు.

విచార‌ణ తేలిందేమ‌న‌గా.. ఆ వ్యక్తి విమానం ఎక్క‌డానికి ముందు ప‌ది గ్రాముల డ్ర‌గ్స్ తీసుకున్నాడ‌ట‌. ఆ త‌ర్వాత విమానంలో త‌న ప‌క్క‌న కూర్చున్న ప్ర‌యాణికుడికి కూడా తెలీని ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకోవాల‌ని బ‌ల‌వంతం చేసాడు. విమానం ల్యాండ్ అయ్యాక త‌లుపును బ‌ద్ధ‌లు కొట్ట‌డం.. పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో అత‌నికి క‌ఠిన కారాగార శిక్ష ప‌డుతుంద‌ని సిబ్బంది తెలిపారు.