The Kerala Story: సినిమా చూస్తుంటే ఈడ్చుకెళ్లిన పోలీసులు

Kolkata: వివాదాస్ప‌దంగా మారిన ది కేర‌ళ స్టోరీ(the kerala story) సినిమాను వెస్ట్ బెంగాల్(west bengal) ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. అయినప్ప‌టికీ కల‌క‌త్తాలోని రంగోలీ మాల్‌లో సినిమాను ప్ర‌ద‌ర్శించారు. దాంతో కొంద‌రు వ్య‌క్తులు ధైర్యం చేసి సినిమా చూడ‌టానికి వ‌చ్చారు. పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో వారిని థియేట‌ర్ నుంచి బ‌య‌టికి లాక్కెళ్లారు. మాల్‌కి వ‌చ్చిన జ‌నం వీడియోలు తీయంతో ఈ విష‌యం కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినిమా ప‌ట్ల త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ ఈ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తే లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తాయేమోన‌న్న భ‌యంతోనే బ్యాన్ చేసాన‌ని వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు.