అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారి.. ప్ర‌పంచంలోనే ఏకైక కేసు ఇదేన‌ట‌

this toddler is suffering from a disease and she is the only patient in the world with it

Viral News: పై ఫోటోలో ఉన్న చిన్నారిని చూసారా? ఎంత ముద్దుగా ఉందో క‌దా..! కానీ ఈ చిన్నారి ఓ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ఇలాంటి వ్యాధితో బాధ‌ప‌డుతున్న ప్రపంచంలోని ఏకైక పేషెంట్ ఈ చిన్నారేన‌ట‌.

ఈ చిన్నారి పేరు మిన్నీ. 37 వారాల‌కే పుట్టేసింది. మిన్నీ త‌ల్లి క‌డుపులో ఉన్న‌ప్పుడే ఉండాల్సిన దాని కంటే త‌క్కువ బ‌రువు ఉండ‌టంతో నెల‌లు నిండ‌కుండానే బ‌య‌ట‌కు తీసేసారు వైద్యులు. మిన్నీ అరుదైన క్రోమోజోమ్ డిలీష‌న్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతోంది. అంటే ఈ చిన్నారి శ‌రీరంలో 21 జన్యువులు మిస్సయ్యాయ‌న్న‌మాట‌. ఇలాంటి వ్యాధి ప్ర‌పంచంలో ఏ ఒక్క‌రికీ లేద‌ట‌. ఇప్పుడు పాపం మిన్నీకి నెమ్మ‌దిగా బ్రెయిన్ డ్యామేజ్ అవుతోంది. చికిత్స చేసినా బ‌తుకుందో లేదో తెలీదు. కానీ ఎవ‌రైనా దాత‌లు సాయం చేస్తే త‌మ బిడ్డ బ‌తికే అవ‌కాశం ఉంద‌ని త‌ల్లిదండ్రులు ఆశ‌తో ఎదురుచూస్తున్నారు.  మిన్నీ ఎప్పుడూ న‌వ్వుతూనే ఉంటుంద‌ని ఆ న‌వ్వులు చూసుకుంటూ బ‌తికేస్తున్నామ‌ని త‌ల్లిదండ్రులు వాపోయారు.