Sheikh Hasina: ప్రపంచంలోనే ‘మోస్ట్ ట్రాక్డ్ ప్లేన్’.. పారిపోయిన ప్రధాని రికార్డు
Sheik Hasina: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న మారణకాండ కారణంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఈరోజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వెంటనే హెలికాప్టర్ సాయంతో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ప్రత్యేక ఆర్మీ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అయితే.. షేక్ హసీనా ప్రయాణించిన విమానం ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన విమానంగా రికార్డు సాధించింది. ఏ విమానం ఎక్కడదాకా వచ్చిందో తెలుసుకునే ఫ్లైట్ ట్రేడర్ 24 యాప్ ఈ విషయాన్ని వెల్లడించింది.
హసీనా ప్రయాణించిన AJAX1413 విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 29 వేల మంది యాప్‌లో లైవ్ ట్రాకింగ్ వీక్షించారు. ఇక ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న హసీనా.. యూకేకి తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు యూకే ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆ ఫార్మాలిటీస్ పూర్తయ్యేవరకు హసీనా ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో ఉంటారు. దాంతో ఢిల్లీ హై అలెర్ట్‌లో ఉంది.