Viral News: వేశ్యలకూ పెన్షన్లు, బీమా ఇస్తున్న తొలి దేశం…!
Viral News: భారత్తో పాటు చాలా దేశాలు వ్యభిచారాన్ని లీగల్ చేసినప్పటికీ వారి జీవితాలు కుక్కలు చించిన విస్తరిలా ఉంటాయి. వారికి సమాజంలో ఎలాంటి విలువ, గౌరవం ఉండవు. చీడ పురుగుల్ని చూసినట్లు చూస్తుంటారు. అన్ని అవమానాలను భరించి బతుకు తెరువు కోసం కష్టపడుతుంటారు. వారిని కూడా మనుషులుగా గుర్తించి పెన్షన్లు, బీమాలు ఇవ్వాలని ప్రపంచంలోని ఒకే ఒక్క దేశం నిర్ణయించుకుంది. అదే దేశం అంటే బెల్జియం.
బెల్జియం పార్లమెంట్లో వేశ్యలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టగా 93 ఓట్లతో బిల్లు పాసయ్యింది. 2022లో బెల్జియం వ్యభిచారాన్ని లీగల్ చేసింది. వేశ్యలకు పెన్షలు, బీమా, నిరుద్యోగ భృతితో పాటు మెటర్నిటీ సెలవులు కూడా ఇవ్వనున్నట్లు అక్కడి పార్లమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తమకు ఫలానా వ్యక్తితో శృంగారంలో పాల్గొనాలని లేకపోయినా.. ఆ ప్రక్రియలో మధ్యలోనే ఆపేసినా కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
అంతేకాదు.. వేశ్యలకు కస్టమర్లను సప్లై చేసే బ్రోకర్లు కూడా వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ప్రతి వేశ్య వద్ద అలారం బటన్ ఉండి తీరాల్సిందే అని బిల్లులో పేర్కొంది. అయితే పోర్న్ వీడియోలు చేసుకునేవారు, స్ట్రిప్పర్లకు మాత్రం ఈ చట్టాలు వర్తించవు.