కారులో విద్యార్థితో నగ్నంగా దొరికిపోయిన టీచర్
Viral News: మంచి చెడులు చెప్పాల్సిన గురువే విద్యార్ధుల పట్ల వికృతంగా ప్రవర్తిస్తుంటే ఇక ఈ సమాజం బాగుపడినట్లే. పెళ్లై భర్త ఉన్నా కూడా కారులో ఓ విద్యార్ధితో రాసలీలలు చేస్తూ దొరికిపోయింది ఓ టీచర్. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
నెబ్రాస్కా ప్రాంతానికి చెందిన ఎరిన్ అనే 45 ఏళ్ల టీచర్ ఆమె పనిచేస్తున్న ఒమాహా పబ్లిక్ పాఠశాలలోనే చదువుతున్న 17 ఏళ్ల విద్యార్ధితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం బెన్నింగ్టన్ ప్రాంతంలోని ఓ రోడ్డు వద్ద ఎరిన్ తన కారులో బాలుడిని ఎక్కించుకుంది. ఎవ్వరూ లేని ప్రదేశంలో కారు ఆపి బాలుడితో చేయకూడని పనులు చేసింది. అది చూసిన స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో బాలుడు కారు నుంచి దిగి పారిపోయాడు. ఎరిన్ దుస్తుల్లేకుండా నగ్నంగా పట్టుబడింది. ఆమెకు దుస్తులు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మాత్రం తన ఇంటి సమీపంలోనే చొక్కా, లో దుస్తులతో కనిపించాడు. బాలుడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఎరిన్ పనిచేస్తున్న పాఠశాల యాజమాన్యంతో పోలీసులు చర్చలు జరిపి ఆమెను అరెస్ట్ చేసారు.
ఈ తరహా ఘటనలు అమెరికాలో ఎక్కువ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇలాగే ఓ టీచర్ తన భర్త ఇంట్లో లేని సమయంలో తన స్టూడెంట్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.