Swapna Barman: ట్రాన్స్‌జెండ‌ర్ వ‌ల్ల నా మెడ‌ల్ పోయింది

భార‌తీయ హెప్టాథ్లాన్ క్రీడాకారిణి స్వ‌ప్నా బ‌ర్మ‌న్  (swapna barman) పెట్టిన పోస్ట్ వివాదాస్ప‌దంగా మారింది. ఆ పోస్ట్ పెట్టిన కాసేప‌టికే ఎందుకొచ్చిన గొడ‌వ అని డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి ఆమెను నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నారు. ఏషియ‌న్ గేమ్స్ 2023లో (asian games) భాగంగా ఇటీవ‌ల జ‌రిగిన హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో స్వప్న కంటే నందిని అస్గారా (nandini asgara) అనే అథ్లెట్ నాలుగు పాయింట్లు ముందుంది. దాంతో నందినికి కాంస్యం ల‌భించ‌గా స్వ‌ప్న‌కు ఖాళీ చేతుల‌తో వెనుదిర‌గాల్సి వ‌చ్చింది.

అయితే నందిని అస్గారా ఒక ట్రాన్స్‌జెండ‌ర్. ఈ నేప‌థ్యంలో త‌న‌కు రావాల్సిన మెడ‌ల్ నాలుగు పాయింట్ల‌తో నందినికి వ‌చ్చింద‌న్న కోపంతో ముందు వెన‌కా ఆలోచించ‌కుండా స్వ‌ప్నా బ‌ర్మ‌న్ ఓ పోస్ట్ పెట్టింది. ఒక ట్రాన్స్‌జెండ‌ర్ వ‌ల్ల నాకు మెడ‌ల్ రాకుండాపోయింది. అస‌లు ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు క్రీడ‌ల్లో అనుమ‌తి లేదు. ద‌య‌చేసి మీరంతా స‌పోర్ట్ చేసి నా మెడ‌ల్ నాకు వ‌చ్చేలా చేయండి అని పోస్ట్‌లో పేర్కొంది. ఆ పోస్ట్‌ని కాసేప‌టికే డిలీట్ చేసేసిన‌ప్ప‌టికీ అది ఆల్రెడీ వైర‌ల్ అయిపోయింది.

దాంతో నెటిజ‌న్లు స్వ‌ప్న ఆలోచ‌నా విధానాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. చేత‌గాక ట్రాన్స్‌జెండర్ అనే టాపిక్ హైలైట్ చేస్తున్నార‌ని దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. 2018లో జ‌రిగిన ఏషియ‌న్ గేమ్స్‌లో స్వ‌ప్న స్వ‌ర్ణం సాధించింది. ఇప్పుడు జ‌రిగిన హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో ఏమీ గెల‌వ‌లేక‌పోవ‌డంతో కంట్రోల్ చేసుకోలేక‌పోతోంది. ప్ర‌పంచ అథ్లెటిక్ రెగ్యులేష‌న్స్ ప్ర‌కారం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే అవ‌కాశం లేదు. ఈ రూల్ ఈ ఏడాది మార్చిలోనే అమల్లోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కాంస్యం సాధించిందిన నందిని అస్గారా ఓ ట్రాన్స్‌జెండ‌ర్ అని స్వ‌ప్న బాంబు పేల్చింది. (swapna barman)

“” ట్రాన్స్‌జెండ‌ర్లకు టెస్టోస్టిరోన్ లెవెల్స్ 2.5 శాతం కంటే ఎక్కువ‌గా ఉంటాయి. నేను హెప్టాథ్లాన్ ర‌న్నింగ్‌లో 13 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్ప‌టివ‌ర‌కు ఏ అమ్మాయి కూడా ఇంత ఫాస్ట్‌గా పాయింట్స్ సాధించ‌లేదు. నందిని నాలుగు నెల‌ల పాటు శిక్షణ తీసుకున్నందుకే ఇంత వేగంగా ప‌రిగెత్త‌గ‌లిగాను అంటోంది. అది అసాధ్యం. ఆమె ట్రాన్స్‌జెండ‌ర్. నా మెడ‌ల్ నాకు వ‌చ్చేలా చేయండి “” అని స్వ‌ప్న మీడియా ముందు కూడా వెల్ల‌డించింది.