తల్లితో ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అని చెప్పి.. టీచర్‌తో గడిపి..!
Viral News: చదువుకోవడానికి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని తల్లితో చెప్పి రాత్రంతా ఓ విద్యార్ధి టీచర్‌తో గడిపిన ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. మాంచెస్టర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 11 ఏళ్ల బాలుడు.. తన స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని తల్లితో చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం అతను ఇంటికి వచ్చాడు. బాలుడి మెడపై ఘాటు పడి ఉండటంతో వెంటనే ఆ బాలుడి స్నేహితుడికి ఫోన్ చేసింది. వివరాలు ఆరా తీయగా అసలు తన కుమారుడు స్నేహితుడి ఇంటికి వెళ్లలేదని.. అతని టీచర్ ఇంటికి వెళ్లాడని తెలిసింది. టీచర్‌తో రెండు సార్లు సెక్స్ కూడా చేసినట్లు ఆ బాలుడు ఒప్పుకోవడంతో ఆ తల్లి గుండె పగిలింది. ఇంతటి నీచానికి ఒడిగట్టిన టీచర్ ఎవరో తెలుసుకునేందుకు తన కుమారుడు చదువుతున్న స్కూల్‌కి వెళ్లి రిసెప్షన్లో నానా హంగామా చేసింది. ఆ తర్వాత పోలీసులను పిలిపించి జరిగినదంతా చెప్పడంతో విషయం బయటపడింది.