Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి ఓపెన్ AI CEO.. మంచి ఆఫ‌ర్ ఇచ్చిన స‌త్య‌నాదెళ్ల‌

Sam Altman: చాట్ GPTని ప్ర‌వేశ‌పెట్టిన ఓపెన్ AI సంస్థ CEO సామ్ ఆల్ట్‌మ‌న్‌ను తొలగించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌కు ఈ ఓపెన్ ఏఐను న‌డిపించే సామ‌ర్ధ్యం లేన‌ట్లు తెలుస్తోంద‌ని త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించుకుంది. ఇదే మంచి త‌రుణం అని భావించిన మైక్రోసాఫ్ట్ CEO స‌త్య‌నాదెళ్ల‌.. (satya nadella) సామ్ ఆల్ట్‌మ‌న్‌ను మైక్రోసాఫ్ట్‌లోకి (microsoft) ఆహ్వానించారు. అడ్వాన్స్‌డ్‌ AI రీసెర్చ్ టీంకి అధినేత‌న‌గా నియ‌మిస్తున్న‌ట్లు స‌త్య‌నాదెళ్ల ట్వీట్ చేసారు.