Fazil Arsi: బ్యాంక్ లోన్ ఇవ్వనందుకే ఆత్మహత్య
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (sabitha indra reddy) గన్ మెన్ ఫాజిల్ అర్సి (fazil arsi) ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న ఫాజిల్‌కు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా రూ.3 లక్షల వరకు లోన్ కోసం ఫాజిల్ పలు బ్యాంక్‌లను సందర్శించారు. ఏ ఒక్కరు కూడా లోన్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో పాలు పోక ఉదయాన్నే తన కుమార్తెను స్థానిక మణికంఠ అనే హోటల్‌కు తీసుకెళ్లి.. అటు తిరుగమ్మా అని చెప్పి సర్వీస్ గన్నుతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఎందుకు తన కుమార్తెను తీసుకెళ్లి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.