Rohit Sharma: ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌డం నా ప‌ని కాదు

వ‌ర‌ల్డ్ క‌ప్ (icc world cup) త్వ‌ర‌లో జ‌ర‌గనున్న నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (rohit sharma) మీడియాతో స‌మావేశ‌మ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో ఓ జ‌ర్న‌లిస్ట్ మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌ను ఇరిటేట్ చేసేలా ప్ర‌శ్న వేసాడు. 2019లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ల‌ బౌండ‌రీల సంఖ్య‌ను బ‌ట్టి విన్న‌ర్ ఎవ‌ర‌నేది నిర్ణ‌యించార‌ని మ‌రి ఈసారి కూడా అలాగే అవుతుందా అని అడిగాడు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ఏంట‌య్యా.. ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌డం నా ప‌ని కాదు అని వెట‌కారంగా స‌మాధానం ఇచ్చాడు.

త‌న ఉద్దేశం ప్ర‌కారం 26, 27 ఏళ్ల వ‌య‌సులో కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకుంటే మంచిద‌ని కానీ త‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌లేద‌ని అన్నాడు. విరాట్ కోహ్లీ, ధోనీలాంటి వాళ్లు ఉన్న‌ప్పుడు తాను కెప్టెన్సీ కోసం వేచి చూడాల‌నుకున్నానని తెలిపాడు. గౌత‌మ్ గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, యువ‌రాజ్ సింగ్ లాంటి స్టార్ క్రికెట‌ర్లు కెప్టెన్సీ కోసం ఎంతో కాలం ఎదురుచూసార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేసాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌కి ముందు త‌న‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు రావ‌డం సంతోషంగా ఉందని.. ఈ బాధ్య‌త చేప‌ట్టే అర్హ‌త త‌న‌కు ఉంద‌ని తెలిపాడు. (rohit sharma)