Aliens: మ‌నుషుల మ‌ధ్యే తిరుగుతున్న గ్ర‌హాంత‌ర‌వాసులు.. బ‌య‌ట‌పెట్టిన షాకింగ్ స‌ర్వే

research says aliens are living among humans

Aliens: గ్ర‌హాంత‌ర‌వాసుల గురించి ఎన్నో క‌థ‌లు విన్నాం. భూమిపై మ‌నుషులు ఎలా జీవిస్తున్నారో… అంత‌రిక్షంలో గ్ర‌హాంత‌ర‌వాసులు అలా జీవిస్తూ ఉంటార‌ని ప‌లు స‌ర్వేలు తేల్చాయి. అయితే తాజాగా వెలువ‌డిన ఓ షాకింగ్ స‌ర్వే ప్ర‌కారం.. ఎక్క‌డో అంత‌రిక్షంలో కాదు.. మ‌న మ‌ధ్యే మ‌నుషుల్లో క‌లిసిపోయి ఇక్క‌డే అవి తిరుగుతున్నాయ‌ట‌. సాధార‌ణంగా గ్ర‌హాంత‌ర‌వాసులు ఎక్కువ‌గా నివ‌సించేది అండ‌ర్‌గ్రౌండ్‌లో, చంద్రుడిపైన‌, భూమిపై మ‌నుషుల రూపంలో ఉంటాయ‌ట‌.

క్రిప్టో టెర్రెస్ట్రియ‌ల్ హైపోతెసిస్ (CTH) థియ‌రీ ప్ర‌కారం ఈ గ్ర‌హాంత‌ర‌వాసులు నాన్ హ్యూమ‌న్ ఇంటెలిజెన్సెస్ (NHI) రూపంలో భూమిపై కానీ భూమికి స‌మీపంలో కానీ ఉన్నాయ‌ట‌. ప‌రిశోధ‌కుల‌కు ఈ విష‌యంలో కాస్త సందేహం ఉన్న‌ప్ప‌టికీ త‌మ ప‌రిశోధ‌న‌ను మాత్రం తీసిపారేయొద్ద‌ని అంటున్నారు. మాజీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి స‌మాచారం ప్ర‌కారం అమెరికా ఓ భారీ UFOకి సంబంధించిన స‌మాచారాన్ని దాచిపెట్టేందుకు య‌త్నిస్తోంద‌ట‌. ఈ UFO సైజు ఓ పెద్ద ఫుట్‌బాల్ అంత ఉంటుందని అధికారి ఆరోపిస్తున్నారు.