Shahid Latif: పఠాన్‌కోట్ దాడి సూత్రధారి హతం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ (pathankot) జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన సూత్రధారి షాహిద్ లతీఫ్ (shahid latif) మృతిచెందాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని మట్టుబెట్టారు. పఠాన్‌కోట్‌లో దాడులకు పాల్పడిన అనంతరం షాహిద్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్ట్‌లో చేరాడు. 2016 జనవరి 2న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో లతీఫ్ ఉగ్రదాడి చేయించాడు. ఈ ఘటనలో చాలా మంది మృతిచెందారు. లతీఫ్ పాకిస్థాన్‌లో ఉంటూనే ఈ ప్లాన్ వేసాడు.
1994 నవంబర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భారత పోలీసులు లతీఫ్‌ను అరెస్ట్ చేసాయి. 2010లో రిలీజ్ అయ్యాక అతన్ని తిరిగి పాకిస్థాన్‌కు పంపించేసారు. అయినా అతని కపట బుద్ధి మారలేదు. 1999లో ఇండియన్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసాడన్న ఆరోపణలు ఉన్నాయి. అలా పాకిస్థాన్‌లో ఉంటూనే ఇండియాపై అనేక ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన లతీఫ్ పీడ ఎట్టకేలకు విరగడైంది. (shahid latif)