Ravi Teja: య‌ష్‌పై కామెంట్స్.. మండిప‌డుతున్న ఫ్యాన్స్

మాస్ మ‌హారాజా ర‌వితేజ (ravi teja) వివాదంలో చిక్కుకున్నారు. క‌న్న‌డ రాకింగ్ స్టార్ యష్‌పై (yash) ఆయ‌న చేసిన కామెంట్స్ ప‌ట్ల ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ర‌వితేజ న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (tiger nageswara rao) సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ర‌వితేజ ఓ ఇంట‌ర్వ్యూలో ఇత‌ర హీరోల గురించి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. రామ్ చ‌ర‌ణ్‌, విజ‌య్ మంచి డ్యాన్స‌ర్స్ అని చెప్పిన ర‌వితేజ య‌ష్ గురించి మాట్లాడుతూ.. KGF సినిమా అత‌నికి రావ‌డం నిజంగా అత‌ను చేసుకున్న అదృష్టం అన్నారు. దాంతో ఫ్యాన్స్‌కి ఒళ్లుమండింది. రవితేజ ఉద్దేశంలో య‌ష్ అస‌లు హీరో కాలేడ‌ని.. అదృష్టం కొద్ది KGF దొర‌క‌డంతో హీరో అయ్యాడ‌ని ఆయ‌న ప‌రోక్షంగా అన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సారీ చెప్ప‌క‌పోతే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా క‌న్న‌డ‌లో ఆడ‌దంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు.