Credit Card Payment: ఇక క్రెడ్, ఫోన్ పే ద్వారా బిల్లులు క‌ట్ట‌లేరు

now you cannot make Credit Card Payments through phone pe cred

Credit Card Payment: ఇక క్రెడిట్ కార్డు పేమెంట్ల‌ను క్రెడ్ నుంచి కానీ బిల్ డెస్క్, ఫోన్ పేల నుంచి కానీ క‌ట్ట‌లేర‌ట‌. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త రూల్ ప్ర‌కారం జులై 1 నుంచి అన్ని క్రెడిట్ కార్డు బిల్లుల‌ను భార‌త్ బిల్ పేమెంట్ సిస్ట‌మ్ (BBPS) ద్వార‌నే చేయాల‌ట‌. ఈ కొత్త రూల్ వ‌ల్ల ఫిన్‌టెక్ కంపెనీలు అయిన ఫోన్ పే, క్రెడ్, బ‌ల్ డెస్క్‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంది. BBPS యాక్టివేట్ చేయ‌ని బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డు పేమెంట్ల‌ను ఈ కంపెనీలు చేయ‌లేవు.

HDFC, ICICI, యాక్సిస్ వంటి పెద్ద బ్యాంకులు ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఈ బ్యాంకులేవీ కూడా BBPS నెట్‌వ‌ర్క్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో జూన్ 30 త‌ర్వాత నుంచి క‌స్ట‌మ‌ర్లు ఈ బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు క‌ట్టలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఈ కొత్త రూల్‌ను అమ‌ల్లోకి తెచ్చేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల‌కు 90 రోజుల గ‌డువు ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా క్రెడిట్ కార్డులు ఇస్తున్న 34 బ్యాంకుల నుంచి కేవ‌లం ఎనిమిది మాత్ర‌మే ఈ BBPSను యాక్టివేట్ చేసుకున్నాయి. పేమెంట్ ప్ర‌క్రియ‌లు ఎలా జ‌రుగుతున్నాయో తెలుసుకునేందుకే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఈ రూల్ ద్వారా ఫేక్ పేమెంట్లు వంటి వాటికి అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంది