Hamas: టార్గెట్ ఇజ్రాయెల్ మాత్ర‌మే కాదు.. యావ‌త్ ప్ర‌పంచం

ఇజ్రాయెల్‌పై (israel) భీక‌ర దాడులకు పాల్ప‌డుతున్న పాలెస్తీనాకు చెందిన ఉగ్ర‌వాద సంస్థ హ‌మాస్ (hamas) క‌మాండ‌ర్ మ‌హ‌మూద్ అల్ జ‌హ‌ర్ (mahmoud al zahar) షాకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసాడు. ఆ వీడియోలో ఇజ్రాయెల్ త‌మ మొద‌టి టార్గెట్ మాత్ర‌మేన‌ని మున్ముందు యావ‌త్ ప్ర‌పంచాన్నే త‌మ ఆధీనంలోకి తెచ్చుకుంటామ‌ని హెచ్చ‌రిక‌ల‌కు పాల్ప‌డ్డాడు.

“” 510 మిలియ‌న్ స్వ్కేర్ కిలోమీట‌ర్లు విస్త‌రించి ఉన్న ఈ భూమిపై ఒక సిస్ట‌మ్ రాబోతోంది. ఆ సిస్ట‌మ్‌లో అన్యాయం, చంపుకోవ‌డాలు, అవ‌మానాలకు చోటు ఉండ‌దు. పాలెస్తీనా వాసుల‌పై, ఇత‌ర దేశాల్లోని అర‌బ్‌ల‌పై జ‌రుగుతున్న నేరాలు కూడా ఇక జ‌ర‌గ‌వు “” అని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహు స్పందిస్తూ.. త‌మ ఉద్దేశంలో హ‌మాస్‌లోని ప్ర‌తి ఒక్క స‌భ్యుడు చ‌నిపోయినవాడితో స‌మాన‌మేన‌ని మ‌రోసారి రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించారు. నేత‌న్యాహు అహం వ‌ల్ల ఈరోజు ఇజ్రాయెల్‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఇది వ‌ర‌కే ఇజ్రాయెల్ మాజీ ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.