RBI నుంచి కొత్త రూ.500 నోట్లు.. రాముడి ముద్రణతో?
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోలకు బదులు రాముడి ముద్రణ ఉండబోతున్నట్లు సమాచారం. మన కరెన్సీపై మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఎర్ర కోట కూడా ఉంటుంది. అయితే కొత్త రూ.500 నోట్ల కట్టలపై రాముడి ముద్రణతో పాటు అయోధ్య రామమందిరం ఫోటోలను ముద్రించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఇలాంటి రూ.500 నోటు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇది ఫేకా కాదా అనే అంశాన్ని మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే రఘు మూర్తి అనే నెటిజన్ మాత్రం ఇవి తాను క్రియేట్ చేసిన ఫేక్ కరెన్సీ నోట్లని కానీ ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.