Mulugu: మాకు వైన్ షాపులు కావాలి
AP: ములుగు జిల్లా మంగపేట మండలంలో ‘మాకు మద్యం షాపులు కావాలి’ అంటూ పెస గ్రామ సభ ద్వారా గిరిజన ప్రజలు (mulugu) ఆమోదం తెలిపారు. మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పెస గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు వారి నిర్ణయాన్ని తెలియజేశారు. కోర్టు స్టే విధించిన కారణంగా మండలంలో గత 5 సంవత్సరాలుగా మద్యం షాపులు లేకపోవడంతో గ్రామస్థులు ఇలా తమ నిర్ణయాన్ని తెలియజేసారు.