Viral News: “మనవడికి పోలికలు లేవు.. DNA టెస్ట్ చేయించాల్సిందే”
Viral News: హాయిగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్న జంటను చూసి ఓర్వలేకపోయింది ఓ గడసరి అత్త. ఎలాగోలా కోడలిని ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ వేయడంతో ఆ ప్లాన్ ఆమెకే బెడిసి కొట్టింది. ఈ విషయాన్ని ఓ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే.. ఓ జంటకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవల మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ సమయంలో అత్తగారు పక్కనే ఉంటానంటే వైద్యులు ఒప్పుకోలేదు. దాంతో ఆమె వారితో గొడవపడింది. ఆ తర్వాత ఆమెను వేరే చోటకు పంపించేసాడు కొడుకు. ఆ తర్వాత ఆమె ఫోన్ చేసి సారీ చెప్పి మళ్లీ వారి ఇంటికి వెళ్లింది.
బిడ్డను చూసి ఎంత బాగున్నాడో ఎంత ముద్దుగా ఉన్నాడో అంటూ తెగ ముద్దు చేసేసింది. అయితే ఎప్పుడైతే కోడలు పాల కోసం కిచెన్‌లోకి వెళ్లిందో భర్త, అత్త అరుపులు వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం జరిగింది అని అడగ్గా.. బిడ్డ పోలికలు కుటుంబంలోని ఏ ఒక్కరితో కూడా పోలట్లేదని.. తనకు కోడలిపై అనుమానం ఉందంటూ డీఎన్ఏ టెస్ట్ చేయించాలని పట్టుబట్టింది. దాంతో ఆ కోడలు షాకైంది. అవమానం భరించలేక కన్నీరుపెట్టుకుంది.
అప్పుడు తన అత్తగారితో నేను DNA టెస్ట్‌కి రెడీ. కానీ మీ కుమారుడు మీకే పుట్టినట్లు కూడా DNA టెస్ట్‌కి మీరు కూడా రెడీనా అని ప్రశ్నించింది. దాంతో భర్త, అత్తగారు షాకయ్యారు. తాను చేసింది తప్పా ఒప్పా అని ఆ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వేలాది మంది ఆమెకు మద్దతు పలుకుతున్నారు.