Covishield: ఎవ‌రికి రిస్క్? ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి?

who are at risk of Covishield vaccine

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను (Covishield) క‌నిపెట్టిన ఆస్ట్రాజెనెకా కంపెనీ బాంబు పేల్చింది. కోవిషీల్డ్ తీసుకున్న‌వారిలో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని యూకేలోని కోర్టుకు వెల్ల‌డించింది. ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలోని చాలా మంది జ‌నాభా తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో అని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

రిస్క్ ఎవ‌రికి ఉంది?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న‌వారు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదని అంటున్నారు ICMR మాజీ శాస్త్రవేత్త డాక‌ర్ట్ రామ‌న్ గంగాఖేడ‌ర్. ఎందుకంటే కోవిషీల్డ్ వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో కేవ‌లం ఏడుగురికి మాత్ర‌మే క‌లిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. మొద‌టి డోస్ తీసుకున్న‌వారిలో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. ఆ త‌ర్వాత రెండు, మూడు డోసులు తీసుకున్న‌వారిలో ఆ రిస్క్ త‌గ్గిపోతుంద‌ని అన్నారు. అయితే ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న రెండు నుంచి మూడు నెల‌ల్లోనే సైడ్ ఎఫెక్ట్స్ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని.. తీసుకున్న ఏడాది తర్వాత ఏమీ కాద‌ని పేర్కొన్నారు.