Siddipet: ఆడిస్తానని తీసుకెళ్ళి మూడేళ్ల పాపపై అత్యాచారం
Siddipet: సిద్దిపేటలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ఆడిస్తానంటూ ఓ మూడేళ్ల పాపను తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. మైత్రివనంలోని గో గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో పెయింటింగ్ వర్క్‌కి చెందిన అజయ్.. అదే అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ మనమరాలిని(3) ఆడిస్తానని తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు.ఆ తర్వాత ఆ చిన్నారిని వదిలేసి పారిపోయాడు.. ఏడుస్తున్న చిన్నారిని చూసిన వాచ్‌మెన్, పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ జరిపి అజయ్‌ను పొన్నాల బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పాప ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పని కోసం సిద్ధిపేటకు వలస వచ్చాడని పోలీసులు తెలిపారు.